ఓవర్‌లోడ్‌.. లైన్‌ హీట్‌! | - | Sakshi
Sakshi News home page

ఓవర్‌లోడ్‌.. లైన్‌ హీట్‌!

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

హన్మకొండ: ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు భరించలేని ఉక్కపోత. వెరసి ఏసీ, కూలర్లతో వినియోగంతో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగింది. దీని ప్రభావం డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లపై పడుతోంది. ఈ భారం సబ్‌స్టేషన్లపై ఆ పై 220, 132 కేవీ సబ్‌ స్టేషన్లపై పడడంతోపాటు 220, 132 కే వీ సబ్‌ స్టేషన్‌ నుంచి 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌కు వచ్చే విద్యుత్‌ లైన్లపై పడడంతో అవి హీటెక్కి తెగిపడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం వరంగల్‌ ములుగు రోడ్‌లోని 220 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి బాలసముద్రం, నక్కలగుట్ట 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌కు వచ్చే 33 కేవీ విద్యుత్‌ లైన్‌ తెగిపోయింది. పై విద్యుత్‌ లైన్‌ తెగి కింద ఉన్న మరో లైన్‌పై పడడంతో సబ్‌ స్టేషన్‌లో మంటలు వ్యాపించాయి. సిబ్బంది మంటలు ఆర్పడంతో పాటు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో అగ్ని మాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. ఫలితంగా పెనుముప్పు తప్పింది. లేనిపక్షంలో భారీ నష్టం వాటిల్లేది.

గణనీయంగా పెరిగిన వినియోగం..

ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరగడంతోపాటు విద్యుత్‌ వినియోగం గణనీయంగా ఉండడంతో లైన్‌పై భారం పడి ఎప్పుడో వేసిన తక్కువ సామర్థ్యం కలిగిన లైన్లు భారం భరించలేక తెగిపడుతున్నాయి. దీని నివారణకు అధిక సామర్థ్యంతో కూడిన విద్యుత్‌ లైన్లను వేయాల్సిన అవసరముందని విద్యుత్‌ రంగ నిపుణులు చెప్పారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ నెల 29న విద్యుత్‌ వినియోగం 12.55 మిలియన్‌ యూనిట్లు ఉండగా గత సంవత్సరం ఇదే రోజు 9.86 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది .అదే విధంగా విద్యుత్‌ డిమాండ్‌ ఈ నెల 29న 550 మెగావాట్లు ఉండగా గతేడాది ఇదే రోజున 406 మెగావాట్లుగా ఉంది.

2026 మేలో విద్యుత్‌ వినియోగం (మిలియన్‌ యూనిట్లలో)..

సర్కిల్‌ తేదీ 25 తేదీ 26 తేదీ 27 తేదీ 28 తేదీ 29

హనుమకొండ 4.21 3.99 4.18 4.15 4.2

వరంగల్‌ 3.08 3.09 3.00 3.02 3.02

జనగామ 1.74 1.74 1.56 1.75 1,79

మహబూబాబాద్‌ 1.79 1.83 1.76 1.75 1.72

భూపాలపల్లి 1.19 1.17 1.17 1.12 1.07

ములుగు 0.8 0.81 0.78 0.72 0.75

మొత్తం 12.82 12.63 12.45 12.51 12.55

2025 మేలో విద్యుత్‌ వినియోగం (మిలియన్‌ యూనిట్లలో)..

(2025లో ములుగు, భూపాలపల్లి జిల్లా ఒకే సర్కిల్‌గా భూపాలపల్లి సర్కిల్‌గా ఉన్నాయి)

సర్కిల్‌ తేదీ 25 తేదీ 26 తేదీ 27 తేదీ 28 తేదీ 29

హనుమకొండ 2.93 2.96 2.89 2.73 3.07

వరంగల్‌ 2.10 2.19 2.18 1.95 2.08

జనగామ 1.47 1.44 1.7 1.43 1.68

మహబూబాబాద్‌ 1.35 1.36 1.45 1.28 1.43

జేఎస్‌భూపాలపలి 1.57 1.62 1.62 1.58 1.6

మొత్తం 9.42 9.57 9.84 8.97 9.86

2026 మేలో విద్యుత్‌ డిమాండ్‌ (మెగావాట్లలో)..

సర్కిల్‌ తేదీ 25 తేదీ 26 తేదీ 27 తేదీ 28 తేదీ 29

హనుమకొండ 254.64 268.94 243.04 253.04 247.37

వరంగల్‌ 195.04 206.97 190.86 193.56 179.46

జనగామ 109.67 111.92 110.02 113.12 123.46

మహబూబాబాద్‌ 128.06 132.17 126.84 129.46 133.69

జేఎస్‌భూపాలపల్లి 57.77 58.16 54.93 54.53 52.33

ములుగు 39.8 42.30 37.31 36.70 37.60

మొత్తం 571 596 512 558 550

2025 మేలో విద్యుత్‌ డిమాండ్‌ (మెగావాట్లలో)

(2025లో ములుగు, భూపాలపల్లి ఒకే సర్కిల్‌గా ఉన్నాయి)

సర్కిల్‌ తేదీ 25 తేదీ 26 తేదీ 27 తేదీ 28 తేదీ 29

హనుమకొండ 177.60 171.26 170.9 213.3 180.95

వరంగల్‌ 145.81 145.73 129.28 138.68 138.82

జనగామ 79.19 73.19 96.44 70.9 82.04

మహబూబాబాద్‌ 89.41 93.93 87.90 92.16 94.62

జేఎస్‌భూపాలపల్లి 71.20 74.63 68.14 77.93 74.11

మొత్తం 390 412 412 404 406

భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం

లోడ్‌భారంతో వేడెక్కి తెగిపడుతున్న విద్యుత్‌ లైన్లు

సబ్‌స్టేషన్లపై తీవ్ర ప్రభావం

Advertisement
 
Advertisement
Advertisement