జయహో జోయాన్‌, జోనిసా.. అదరహో ప్రవీణ్‌ | - | Sakshi
Sakshi News home page

జయహో జోయాన్‌, జోనిసా.. అదరహో ప్రవీణ్‌

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

క్రికెట్‌ శిక్షణ .. భవితకు రక్షణ

పరకాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం క్రికెట్‌ శిక్షణకు వేదికగా మారింది. ప్రతీ ఏడాది హెచ్‌సీఏ సహకారంతో కోచ్‌ అరుణ్‌కుమార్‌ సారథ్యంలో శిక్షణ అందిస్తున్నారు. ఇందులో యువకులు గ్రామీణం నుంచి జాతీయస్థాయి క్రికెట్‌ ఆడడమే లక్ష్యంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పరకాలకు చెందిన మంచిక వినయ్‌ రంజీ క్రికెట్‌లో పాల్గొని..హెచ్‌సీఏ వేసవి శిక్షణకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. –పరకాల

ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లోని జో రాస్ట్రియన్‌ క్లబ్‌లో గిన్నీస్‌ బుక్‌ ప్ర తినిధుల సమక్షంలో కీబోర్డు సంగీత వాయిద్య పోటీలు నిర్వహించారు. 22 దేశాల నుంచి సుమారు 2వేల మంది వాయిద్యకారులు హాజరై ఏకకాలంలో గంట సమయం వరకు ఆగకుండా ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ముగ్గురు ప్రతిభ కనబరిచి వరల్డ్‌ రికార్డుకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం (ఈనెల 29న) హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన గిన్నీస్‌ అచీవర్స్‌ మీట్‌లో హల్లేల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ వ్యవస్థాపకుడు దండంగి ఆగస్టు, గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా సర్టిఫికెట్‌, మెడల్స్‌ అందుకున్నారు. ఇందులో జనగామ మండలం ఓబుల్‌కేశ్వపూర్‌ గ్రామానికి చెందిన పాస్టర్‌ విజేందర్‌, జయశీల దంపతుల కుమార్తె ఉడుతల జోయాన్‌ (2వ తరగతి), వరంగల్‌ కొత్తవాడ ప్రాంతానికి చెందిన దివ్య, జాయ్‌ తంబిరాజ్‌ దంపతుల కూతురు జోనిసా ఎస్తేర్‌( ఫస్ట్‌ క్లాస్‌), మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని రామన్నపేట కాలనీకి చెందిన వయంతుల వెంకటేశ్వర్ల, పద్మ దంపతుల కుమారుడు ప్రవీణ్‌ ఉన్నారు. దీంతో వీరిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.

–జనగామ రూరల్‌/కాశిబుగ్గ/మహబూబాబాద్‌ అర్బన్‌/మహబూబాబాద్‌ రూరల్‌

కీబోర్డు వాయిద్య పోటీల్లో గిన్నీస్‌ రికార్డు సాధించిన ఉమ్మడి జిల్లా వాసులు

Advertisement
 
Advertisement
Advertisement