అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

గీసుకొండ: ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను అరెస్ట్‌ చేసి వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విశ్వేశ్వర్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం గీసుకొండ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన సూర రవి, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని సమ్మక్కబజార్‌కు చెందిన ఎండీ ఇమ్రాన్‌(ఇమామ్‌) పాత నేరస్తులు. వీరు వివిధ కేసుల్లో అరెస్ట్‌ అయ్యి జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో స్నేహితులయ్యారు. ఈ క్రమంలో ఇటీవల గీసుకొండ మండలంలోని రాంపూర్‌, ఎలుకుర్తి, శాయంపేట, గొర్రెకుంట గ్రామాల పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ బావులు, ఎస్సారెస్సీ కాల్వ వద్ద వ్యవసాయ మోటార్లు, ఇనుప సామగ్రితోపాటు బైక్‌లను అపహరించారు. శుక్రవారం ఎస్సై జి. అనిల్‌కుమార్‌ సిబ్బందితో కలిసి కొనాయమాకుల కాకతీయ కెనాల్‌ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరు బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తూ పారిపోవడానికి యత్నించారు. అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద నుంచి మొత్తం రూ. 35,500 విలువైన బైక్‌, రెండు 3 హెచ్‌పీ మోటార్లు, మోటార్‌ వాల్వ్‌ తదితర వస్తువులు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసినట్లు సీఐ వివరించారు. సమావేశంలో ఎస్సైలు కుమార్‌, అనిల్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

చోరీ సొత్తు స్వాధీనం

వివరాలు వెల్లడించిన పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement