రైతులకు నాణ్యమైన విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

రైతులకు నాణ్యమైన విత్తనాలు

May 31 2026 1:36 AM | Updated on May 31 2026 1:36 AM

రైతులకు నాణ్యమైన విత్తనాలు

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి

హన్మకొండ: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండ ఐడీఓసీ సమావేశ మందిరంలో హనుమకొండ, వరంగల్‌ జిల్లాల విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులు, ఏఆర్‌ఎస్‌కే కేంద్రాల ప్రతినిధులతో శనివారం విస్తృతస్థాయి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు జిల్లాల్లో రైతుల ఆదాయం పెరగాలంటే, పెసర, కంది, మినుము, శనగ, వేరుశనగ, నువ్వుల పంటలు సాగుచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఖరీఫ్‌లో విత్తనాల కొరత లేదని అన్వేష్‌రెడ్డి స్పష్టం చేశారు. బీపీటీ 5204, ఆర్‌ఎన్‌న్‌ఆర్‌ 15048, కేఏఎం 1638 సన్న రకాలు, కేఏఎం 118, ఎంటీయూ 1010 దొడ్డు రకాల విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని వివరించారు. రెండు జిల్లాల్లో దాదాపు 2.68 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేస్తున్నామని, అందుకు 66 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని తెలిపారు. ఇందులో కనీసం 30 వేల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం ద్వారా సరఫరా చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల వ్యవసాయ అధికారులు రవీందర్‌ సింగ్‌, విజయనిర్మల పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement