కాశిబుగ్గ : ఎంజీఎం క్యాజువాలిటీలో కొంతమంది డాక్టర్లు రోగులకు సంబంధించిన రిక్విజిషన్లపై పూర్తి వివరాలు రాయకపోవడంపై అధికారులు స్పందించారు. ‘నిర్లక్ష్యం వీడని వైద్యులు’ అనే శీర్షికతో శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. విచారణ అఽధికారిగా డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ మధుకర్ యాదవ్‌ను నియమించారు. దీనిపై సీఎంఓ, డీఎస్‌ఓ, ఇన్‌చార్జి సిస్టర్ నుంచి వివరాలను తెలుసుకుని, సూపరింటెండెంట్ దృష్టికి తీసుకవెళ్తామని వి చారణ అధికారి మధుకర్ యా దవ్ తెలిపారు. సోమవారం విచారణ చేపడుతామని ఆయన పేర్కొన్నారు.


