ఇక ప్రమాదాలకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

ఇక ప్రమాదాలకు అడ్డుకట్ట

Mar 15 2026 1:27 AM | Updated on Mar 15 2026 1:27 AM

ఖిలా వరంగల్‌: రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో ప్రత్యేక ని ర్ణయం తీసుకుంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా రాత్రివేళ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది ప్రాణాలొదులుతున్నారు. వాటిని అరికట్టేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు గతనెల 20వ తేదీ నుంచి రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్లను తప్పనిసరి చేసింది. ద్విచక్రవాహనాలతో సహా అన్నింటినీ వాటిపై అతికించుకోవాలని రవాణాశాఖ ఆదేశించింది. దీని బాధ్యతను గుర్తింపు ఉన్న ఓ సంస్థకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లపై రవాణాశాఖ లోగో, హోలో గ్రామ్‌, సీరియల్‌ నంబర్‌ కలిగిన క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది.

500 మీటర్ల దూరంలో ఉన్న వాహనం

రాత్రివేళ రోడ్డుపై నిలిపిన వాహనం ఒక్కోసారి కనిపించకపోవడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఓవర్‌టేక్‌ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనం ఎంత దూరం ఉందో తెలియక డ్రైవర్‌ ఆందోళన చెంది ప్రమాదాలపాలైన పరిస్థితి ఉంటోంది. రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లను అతికించుకోవడం ద్వారా 500 మీటర్ల దూరం నుంచే ముందు వెళ్లే వాహనం స్పష్టంగా కనిపిస్తుంది. తద్వారా రాత్రివేళ సంభవించే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చనేది అధికారులు భావన.

రవాణావాహనాలకు తప్పనిసరిగా

ఇకపై రవాణా వాహనాలపై క్యూఆర్‌ కోడ్‌ ఉన్న రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు, రియల్‌ మార్కింగ్‌ ప్లేట్లు తప్పనిసరి చేసింది. ఆర్టీఏ కార్యాలయాల వద్ద రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు విక్రయించే సంస్థ అందుబాటులో ఉంది. ఈవిధానం గతనెల 20 నుంచి అమల్లోకి వచ్చినా.. ఏర్పాట్లు ఆలస్యం కావడంతో నెలరోజులు గడువు పెంచింది.

ఫిట్‌నెస్‌ జారీ..

రాష్ట్ర రవాణాశాఖ లోగోతోపాటు ప్రత్యేక సీరియల్‌ నంబర్‌ కలిగిన క్యూర్‌ కోడ్‌ నంబర్‌ను స్టిక్కర్‌పై ముద్రించి ఉంటుంది. స్టిక్కర్‌ అమర్చాక వాహన యజమానికి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అందులో వాహనం నంబర్‌, తయారీ సంస్థ వివరాలు, ఫొటో, వారంటి వివరాలుంటాయి. ఇప్పటికే అఽ దీకృత డీలర్లను ఎంపిక చేసినందున వాహనదారులు వారివద్దనే స్టిక్కర్లను పొందాల్సి ఉంటుంది.

ముమ్మరంగా తనిఖీలు..

ఫిట్‌నెస్‌ కోసం వచ్చే వాహనాలను అధికారులు ఇకపై క్షుణ్ణంగా తనిఖీలు చేయనున్నారు. స్టిక్కర్‌పై బార్‌కోడ్‌ నంబర్‌ లేకుంటే ధ్రువీకరణ పత్రం ఇవ్వబోమని అధికారులు చెబుతున్నారు. హైవేలపై రాత్రి వేళ, అర్ధరాత్రి, తెల్లవారుజామున ముందున్న వాహనాలను వెనుక నుంచి ఢీకొనే ఘటనలు పెరుగుతున్నాయి. అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడం, బ్రే క్‌ డౌన్‌తో వాహనాలు నిలిచిపోయిన సందర్భాల్లో రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు ఉంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించొచ్చని రవాణాశాఖ విశ్లేషిస్తోంది.

వాహనాలకు రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు,

రియల్‌ మార్కింగ్‌ ప్లేట్లు

రాత్రివేళ రోడ్డుపై స్పష్టంగా

కనిపించనున్న వెహికిల్స్‌

క్యూఆర్‌ కోడ్‌ ఉంటేనే ఫిట్‌నెస్‌

పత్రాలు జారీ

వాహన యజమానులపై పెనుభారం

ఉమ్మడి జిల్లాలో ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు

జిల్లా వాహనాల సంఖ్య

వరంగల్‌ 35136

హనుమకొండ 55,271

మహబూబాబాద్‌ 28,644

ములుగు 3,144

జనగామ 15,126

జేఎస్‌ భూపాలపల్లి 5,860

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement