హసన్‌పర్తి: విద్యుదాఘాతంతో శివాజీనగర్‌లో శనివారం ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఇంట్లో ఉన్న రూ.మూడు లక్షల విలువైన సామగ్రి కాలిబూడిదైందని బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు, ఎస్సై దేవేందర్ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
వీధిన పడిన కుటుంబం..
ప్రమాదంతో బాధిత కుటుంబం వీధిన పడింది. ఆ ఇంటిలో అక్కాతమ్ముళ్లు మానస, రుతికేశ్ మాత్రమే ఉంటున్నారు. పదేళ్ల క్రితం తల్లి మృతి చెందింది. వారు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.


