గంజాయి మత్తులో వృద్ధ దంపతులపై దాడి | - | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తులో వృద్ధ దంపతులపై దాడి

Mar 15 2026 1:27 AM | Updated on Mar 15 2026 1:27 AM

ఖిలా వరంగల్‌: వరంగల్‌ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో యువకులు గంజాయి మత్తులో పగలు, రాత్రి రహదారులపై హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో శంభునిపేటలోని కందగట్ల శ్రీనివాస్‌, అతడి భార్యపై ఐరన్‌ రాడ్లతో శుక్రవారం రాత్రి దాడి చేశారు. తీవ్ర గాయాలైన వారిని స్థానికులు హుటాహుటినా ఆటోలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. దీనిపై శనివా రం బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బాధితులను సామాజిక కార్యకర్త ఎండీ ఫసి పరామర్శించారు. గంజాయి సేవించేవారు, సరఫరా చేస్తున్న వారిపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement