వరంగల్ స్పోర్ట్స్: న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ పిక్స్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పారా అథ్లెట్లు సత్తా చాటారు. ఎ. లోకేశ్ (ఎఫ్–46) జావెలిన్‌త్రో, షాట్‌పుట్ విభాగాల్లో రెండు కాంస్య పతకాలు సాధించగా, పి. మమత (ఎ–55) జావెలిన్‌త్రో, షాట్‌పుట్ విభాగాల్లో సత్తా చాటి రెండు కాంస్య పతకాలు సాధించారు. ఇద్దరు క్రీడాకారులు హైదరాబాద్‌లోని ద్రోణాచార్య పారా అకాడమీలో కోచ్ వేణు వద్ద శిక్షణ పొందుతున్నారు.
ప్రిస్క్రిప్షన్ లేకుండా హెచ్1 ఔషధాల విక్రయాలు
● సిరి మెడికల్ షాపుపై కేసు నమోదు
ఎంజీఎం : ప్రిస్క్రిప్షన్ లేకుండా హెచ్1 ఔషధాలు విక్రయిస్తున్న వరంగల్ ఎంజీఎం రోడ్డులోని సిరి మెడికల్ షాపుపై డ్రగ్ కంట్రోల్ అఽధికారులు కిరణ్‌కుమార్, శ్రవణ్‌కుమార్ కేసు నమోదు చేశారు. హనుమకొండలోని ఓ మెడికల్ షాపులో కొనుగోలు చేస్తున్న హెచ్1 ఔషధాలతో మత్తుకు అలవాటు పడుతున్నారనే విషయాన్ని గుర్తించి ట్రాస్క్‌ఫోర్స్ పోలీసులు పలువురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో ఎంజీఎం రోడ్డులోని సిరి మెడికల్ షాపులో విక్రయిస్తున్నట్లు సదరు యువకులు తెలుపడంతో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శివకేశవులు, సతీశ్‌కుమార్ డ్రగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం డ్రగ్ కంట్రోల్ అధికారులు సదరు మెడికల్ షాపులో హెచ్1 ఔషధాల వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
బైక్ ఢీకొని వృద్ధుడి మృతి
టేకుమట్ల: బైక్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇ చ్చంతుల రాజకొంరయ్య(65) శనివారం వ్యక్తి గత పని మీద మండల కేంద్రానికి వచ్చాడు. తిరిగి నడుచుకుంటూ ఇంటికెళ్తున్న క్రమంలో మండలంలోని రాఘవరెడ్డి పేట గ్రామానికి చెందిన ఉమేందర్ బైక్‌తో రాజకొంరయ్యను ఢీకొన్నాడు. దీంతో ఆ వృద్ధుడు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడడంతో గమనించిన స్థానికులు 108లో చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై అమూల్య తెలిపారు.


