గులాబీ జెండా ఎగరడం ఖాయం
మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత నివాస గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ సీపీఐకి మిత్ర ద్రోహం చేసిందన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సీపీఐకి వంద సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. కమ్యూనిస్టు పార్టీ మాట తప్పదన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీఆర్‌ఎస్, సీపీఐ కలిసి పోరాటం చేసిందని గుర్తు చేశారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథిరెడ్డి, డీఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్, నాయకులు అజయ్‌సారథిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, కె ఎస్‌ఎన్ రెడ్డి, కుమార్, నవీ న్, శ్రావణ్, వీరన్న, ఫాతిమా పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్


