పైసా వసూల్‌! | - | Sakshi
Sakshi News home page

పైసా వసూల్‌!

Feb 6 2026 8:51 AM | Updated on Feb 6 2026 8:51 AM

పైసా

పైసా వసూల్‌!

పైసా వసూల్‌! ప్రధాన పార్టీల నాయకులపై ఆర్థిక ఆరోపణలు న్యాయవాదులకు రక్షణ కల్పించాలి

న్యూస్‌రీల్‌

ఆర్థిక అభియోగాలు..

శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షి, మహబూబాబాద్‌:

‘నాకు ఓటు హక్కు వచ్చిన నాటినుంచి పార్టీకి తప్ప మరోపార్టీకి ఓటు వేయడం తెలియదు.. కష్టకాలంలో కూడా పార్టీని వీడలేదు.. ఈ సారి నాకే తప్పకుండా టికెట్‌ వస్తుందని భావించాను.. కానీ నాకు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన నాయకుడికి టికెట్‌ ఇచ్చారు.. నేను ఇండిపెండెంట్‌గా బరిలో దిగి సత్తా చూపిస్తా.. నేను గెలవకపోయినా.. నాకు కాదని టికెట్‌ ఇచ్చిన అభ్యర్థిని గెలవనివ్వను.’

‘నాకు ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదు.. నన్ను పోటీ చేయమని అడిగారు.. నేను నామినేషన్‌ వేసిన తర్వాత ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు.. నాకు లేని ఆలోచన కల్పించి ఇప్పుడు కాదంటే ఎలా. నా బలమేంటో చూపిస్తా.’

‘పార్టీ పెద్దలు చెప్పిన విధంగా పోటీకి సిద్ధమయ్యాను. డబ్బులు రెడీ చేసుకొమ్మంటే నానా ఇబ్బందులు పడి రూ.30లక్షల మేరకు సమకూర్చుకున్నా. తీరా నాకు కాకుండా వేరేవారికి టికెట్‌ ఇచ్చారు.. నేనెలా పార్టీకి సహకరిస్తా.. ఇలాంటి సంస్కృతి పార్టీలో ఎన్నడూ లేదు.. ఇప్పుడు వచ్చిన నాయకులే ఇలా చేస్తున్నారు.. పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు.’

ఇలా జిల్లాలోని మహబూబాబాద్‌, మరిపెడ, తొర్రూరు, కేసముద్రం, డోర్నకల్‌ మున్సిపాలిటీల్లో టికెట్‌ ఆశించి చివరి నిమిషంలో పార్టీ బీ–ఫాం రాని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీ అన్యాయం చేసిందంటే.. మరికొందరు ఎమ్మెల్యే కావాలని చేశారని, ఇంకొందరు డబ్బు మహిమ అని, మరికొందరు సొంత వారికోసం తమను బలి చేశారని చెబుతున్న మాటలు మున్సిపల్‌ ఎన్నికల్లో వైరల్‌గా మారుతున్నాయి.

గెలవకుంటే..అభాసుపాలే

అభ్యర్థులకు టికెట్‌ కేటాయించిన నాయకులకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఏరికోరి టికెట్‌ ఇచ్చిన వారు గెలిస్తే బలమున్న నాయకుడికి టికెట్‌ ఇచ్చినట్లు అవుతుంది. ఓడిపోతే మాత్రం కావాలనే ప్రజా బలం లేకపోయినా టికెట్‌ ఇచ్చారనే అపవాదు మూటకట్టుకోవాల్సి వస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే సర్వే ఆధారంగా టికెట్‌ ఇచ్చామని పైకి చెప్పినా.. ఓడిపోతే మాత్రం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం నాయకులను పట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఆయా అభ్యర్థుల గెలుపుకోసం నాయకులు శ్రమిస్తున్నారు.

టికెట్ల కేటాయింపులో

డబ్బులు తీసుకున్నట్లు

నిందలు

ఆ అభ్యర్థులు గెలవకుంటే

అభాసుపాలే

ఆరోపణల నేపథ్యంలో

ప్రతిష్టాత్మకంగా

తీసుకుంటున్న నేతలు

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే.. అన్ని పార్టీల నాయకులు ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవడంతో పాటు వారి అభిప్రాయ సేకరణకు సమీక్షలు నిర్వహించారు. కాగా, ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ.20లక్షల నుంచి రూ.30లక్షలు వరకు సిద్ధం చేసుకోవాలని అన్ని పార్టీల నాయకులు ఆశావహులకు సూచించినట్లు సమాచారం. అయితే టికెట్‌ రాని వారు తమను డబ్బులు సిద్ధం చేసుకోమని చెప్పి.. ఇప్పుడు మాట తప్పారని చెబుతున్నారు. మరికొందరైతే.. వార్డు సభ్యుల వద్ద లక్షల రూపాయలు తీసుకొని టికెట్లు ఇచ్చారని బహిరంగంగా ఆరోపణలు చేశారు. ఈ విషయంపై జిల్లా నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు చర్చ జరుగుతోంది.

పైసా వసూల్‌!1
1/2

పైసా వసూల్‌!

పైసా వసూల్‌!2
2/2

పైసా వసూల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement