ఎన్నికల ఉపాధి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఉపాధి

Feb 6 2026 8:51 AM | Updated on Feb 6 2026 8:51 AM

ఎన్నికల ఉపాధి

ఎన్నికల ఉపాధి

రోజు రూ.300నుంచి రూ.500 వరకు గిట్టుబాటు

జోరుగా ప్రచారం ..

ఓటుకు రూ.1,000పైనే..

మహబూబాబాద్‌: ఎన్నికల పుణ్యమా అని చాలామంది ఉపాధి పొందుతున్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం ప్రచారానికి వెళ్తున్నారు. దీంతో నిర్మాణ రంగంలో కూలీల కొరత ఏర్పడింది. కాగా, పనులు నిలిచిపోతున్నాయని తాపీ మేసీ్త్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు..

జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగా, మానుకోట మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో 155మంది బరిలో ఉన్నారు. మరిపెడలోని 15 వార్డుల్లో 36 మంది, డోర్నకల్‌లోని 15 వార్డుల్లో 64 మంది, తొర్రూరులోని 16 వార్డుల్లో 63 మంది, కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో 58 మంది బరిలో ఉన్నారు. ఈనెల 11 పోలింగ్‌ ఉండగా, 13న ఓట్ల లెక్కింపు, విజేతలను ప్రకటిస్తారు.

ప్రచారంలో

అభ్యర్థుల పాట్లు..

ప్రచారంలో అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పిల్లలకు స్నానం చేయించడం లాంటి వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఓటరు జాబితాను దగ్గర పెట్టుకుని హైదరాబాద్‌ ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఉదయం, రాత్రి ఖాళీ సమయాల్లో ఫోన్‌ చేసి ఓటు వేయాలని కోరుతున్నారు. ప్రయాణ ఖర్చులు ఇస్తామని తదితర హామీలు ఇస్తున్నారు.

ఉదయం అల్పాహారం,

మధ్యాహ్నం భోజనం

కూలీల కొరతతో పనులు

నిలిచిపోతున్నాయని మేసీ్త్రల ఆవేదన

ప్రచారంలో అభ్యర్థుల పాట్లు

బరిలో ఉన్న అభ్యర్థులు డబ్బుల ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డుల్లో అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారం హోరెత్తిస్తు న్నారు. ప్రచారానికి అధికసంఖ్యలో జనంతో ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రచా రానికి వెళ్లే వారికి ప్రతీరోజు రూ.300 నుంచి రూ.500 ఇస్తున్నారు. పైసలతో పాటు ఉద యం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పె డుతున్నారు. రాత్రి సమయంలో పెద్ద ఎత్తున విందులు కూడా నిర్వహిస్తున్నారు. వారితో తిరిగే వారికి మందు అలవాటు ఉన్న వారి మందు ఇతరత్రా సమకూరుస్తున్నారు.

గత ఎన్నికల్లో ఓటుకు రూ.1000 ఇచ్చారు. కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.4000 కూడా ఇచ్చారు. ఆ వార్డులో ఉన్న అభ్యర్థుల ఆర్థిక స్థోమతను బట్టి డబ్బులు పంచారు. గత ఎన్నికలను బేరీజు వేసుకుంటూ అదే రీతిలో ప్రస్తుతం ఇస్తారని ఓటర్లు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement