ఘనంగా పగిడిద్దరాజు జాతర
పగిడిద్దరాజు ఆలయంలోని గద్దైపె మొక్కులు చెల్లిస్తున్న భక్తులు
గంగారం: మండలంలోని పూనుగొండ్ల గ్రామంలోని పగిడ్దిరాజు ఆలయంలో రెండో రోజు గురు వారం తిరుగువారం జాతర ఘనంగా జరిగింది. పూజలు ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. దేవుడి గుట్ట నుంచి వనం తీసుకొచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గద్దైపె ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీరాలని వరం (సంతు) పట్టారు. కార్యక్రమంలో పూజరులు పెనక రాజేశ్వర్, పురుషోత్తం, సురేందర్, రాహుల్, వెంకటేశ్వర్లు, సమ్మయ్య తదిరతులు పాల్గొన్నారు.


