యాప్ ద్వారా యూరియా పంపిణీ
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా పంపిణీ విజయవంతంగా జరుగుతుందని డీఏఓ బి.సరిత అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని పీఏసీఎస్ వద్ద గురువారం యూరియా పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వారం రోజుల్లో 25,107 మంది రైతులు 1,05,031 యూరియా బస్తాలను యాప్ ద్వారా బుక్ చేసుకున్నారని, 81,010 బస్తాలను కొనుగోలు చేశారన్నారు. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల లోపు రైతులు సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి బస్తాలు కొనుగోలు చేయాలన్నారు. 24 గంటల లోపు యూ రియా తీసుకోకపోతే ఆ బుకింగ్ రద్దవుతుందని, మ ళ్లీ రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప ట్టాదారులు, పట్టా పుస్తకాలులేనివారు, కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
డ్రోన్ ద్వారా మందుల పిచికారీ సులభం..
మరిపెడ రూరల్: రైతులు డ్రోన్ ద్వారా పురుగు మందులు పంటలకు పిచికారీ చేయడం ఎంతో సులభతరమని డీఏఓ బి.సరిత అన్నారు. గురు వారం మరిపెడ మండలం లచ్చతండా గ్రామ పంచాయతీ పరిధిలో డ్రోన్ ద్వారా పురుగు మందుల పిచికారీపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకుడు విజయ్‌చంద్ర, వ్యవసాయ విస్తరణ అధికారి బోడ వీరసింగ్, ఏఈఓ స్రవంతి, కారోబార్ నరేష్, రైతులు పాల్గొన్నారు.
డీఏఓ సరిత


