బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా..
● కారు ఢీకొని వ్యక్తి మృతి
● వంగాలపల్లిలో ఘటన
చిల్పూరు: బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని వంగాలపల్లి గ్రామ బస్ స్టేజీ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి కృష్ణారెడ్డి (54) ఆటోలో చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలోని ఎస్‌బీఐకి వస్తూ కరుణాపురంలో దిగాడు. అక్కడ బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి హనుకొండకు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ కదిరె సాయివివేకానందరెడ్డిపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.


