సకుటుంబ సపరివారంగా..
● తల్లి సర్పంచ్.. తనయుడు ఉప సర్పంచ్..
● భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్‌గా
ప్రమాణస్వీకారం
సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలంలోని 33 గ్రామపంచాయతీల్లో నూతన పాలకవర్గాలు సోమవారం అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశాయి. ఇందులో తల్లి సర్పంచ్‌గా తనయుడు ఉప సర్పంచ్‌గా, భార్య సర్పంచ్‌గా భర్త ఉప సర్పంచ్‌గా, నాడు భర్త సర్పంచ్‌గా, నేడు భర్త సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించారు.
● తీగరాజుపల్లి మాజీ సర్పంచ్‌గా కర్జుగుత్త రమ కొనసాగగా సోమవారం భర్త గోపాల్ సర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు. మండలంలోని మొండ్రాయిలో తల్లి గూడ స్వరూప సర్పంచ్‌గా తనయుడు విజయ్‌కుమార్ ఉపసర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు. పెద్దతండాలో భార్య గుగులోత్ వినోద సర్పంచ్‌గా, భర్త రవీందర్‌నాయక్ ఉపసర్పంచ్‌గా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, అరకొర వసతుల మధ్య నూతన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మండలంలోని ఎల్గూర్‌రంగంపేటలో జీపీ భవనం లేకపోవడంతో మత్స్యపారి శ్రామిక సంఘం కమ్యూనిటీహాల్‌లో, ముమ్మడివరంలో ప్రభుత్వ పాఠశాల భవనంలో, గొల్లపల్లిలో అద్దె భవనంలో నూతన పాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి.
సంగెం మండలం మొండ్రాయిలో సర్పంచ్‌గా తల్లి స్వరూప, ఉపసర్పంచ్‌గా తనయుడు విజయ్‌కుమార్, వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తున్న అధికారులు


