పనులు మొదలెట్టారు
డోర్నకల్ మండలం ఉయ్యాలవాడలో ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బానోత్ శ్యాంబాబు గ్రామంలోని మట్టిరోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తానని హామీ ఇచ్చారు. ప్రమాణ స్వీకారం చేయగానే నేరుగా గ్రామంలో పాడైన రోడ్డు వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డు పోసే పనులకు శంకుస్థాపన చేశారు.
కొత్తగూడ మండలం ముస్మి గ్రామ సర్పంచ్‌గా పోటీచేసిన బానోత్ దేవేందర్ ఎన్నికల ప్రకారంలో భాగంగా తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలోని వీధిలైట్లు మరమత్ము చేస్తా.. ఇతర పనులు చేయిస్తాను అని మాట ఇచ్చారు. ఎన్నికల్లో 420 ఓట్ల మెజార్టీతో గెలిశారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుగానే ఆదివారం రాత్రి తన సొంత ఖర్చులతో వీధిలైట్లు అమర్చి వెలుగులు నింపారు.
మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామానికి చెందిన కోట విజేందర్ తన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, మురికి కాల్వలు తీయడం లేదని, మొక్కల పెంపకానికి ప్రధాన్యత ఇచ్చి గ్రామాన్ని పచ్చదనంతో నింపుతానని హామీ ఇచ్చారు. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విజేందర్ నేరుగా అపరిశుభ్రంగా ఉన్న కాలనీల వద్దకు వెళ్లి పారిశుద్ధ్య పనులు చేయించారు.
పనులు మొదలెట్టారు
పనులు మొదలెట్టారు


