చదువుతోపాటు కళల్లోనూ రాణించాలి
హన్మకొండ కల్చరల్ : విద్యార్థులు చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు. వరంగల్ హంటర్‌రోడ్డులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం.. జానపద గిరిజన విజ్ఞానపీఠంలో శుక్రవారం ఎం.ఏ తెలుగు కోర్సు నూతన విద్యార్థుల స్వాగత వేడుక ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ వెంకన్న సరస్వతి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతిప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమని తాము పరిచయం చేసుకున్నారు. సీనియర్లు, జూనియర్ విద్యార్థులకు పెన్నులు బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం జూనియర్ అసిస్టెంట్ అమేర్ ఆలీఖాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, డాక్టర్ బాసాని సురేష్, చూరేపల్లి రవికుమార్, గోపాల్‌రెడ్డి, సునీత, సతీష్, విజయలక్ష్మి, విజ్ఞానపీఠం సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జానపద గిరిజన విజ్ఞానపీఠం
పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న


