విద్యార్థులు ఎదిగేలా ప్రోత్సహించాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టే అంకుర సంస్థలను ఏర్పాటుచేసే విధంగా ప్రోత్సహించాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి టీహబ్ ప్రతినిధులకు సూచించారు. కేయూలోని కెహబ్.. హైదరాబాద్ టీహబ్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)లో భాగంగా శుక్రవారం యూనివర్సిటీలో టీహబ్ ప్రతినిధులతో వీసీ ప్రతాప్‌రెడ్డి సమావేశమై ప్రతిపాదిత అంశాలపై చర్చించారు. ఒక ఐడియాతో వచ్చే విద్యార్థులను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లుగా ఎదిగేలా టీహబ్ సహకారం అందించాలని కోరారు. అనంతరం టీహబ్ ప్రతినిధుల బృందం వివిధ విభాగాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. శిక్షణ, తోడ్పాటు అందించే విధానాన్ని టీహబ్‌కు సంబంధించిన అకాడమిక్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ) సీఈఓ రాజేష్ కుమార్ విద్యార్థులకు వివరించారు. ఈ బృందంతో కెహబ్ డైరెక్టర్, ప్రొఫెసర్ సవితాజ్యోత్స్న, రూసా నోడల్ ఆఫీసర్ కేయూ జియాలజీ విభాగ ం ప్రొఫెసర్ ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, కోఆర్డినేటర్ సిద్ధార్థ్ ఉన్నారు. టీహబ్ ప్రతినిధులు సీనియర్ మేనేజర్ స్వరూపరాణి, ప్రతినిధులు చేతన్, శ్రవణ్, చైతన్య శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి


