ఔషధ పరిజ్ఞానంతో ఉన్నత ఉద్యోగం
మామునూరు : ఔషధ పరిజ్ఞానంతో పాటు టెక్నికల్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉన్నప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చని సినీ నటుడు, నంది అవార్డు గ్రహీత కేవీ.ప్రదీప్ అన్నారు. వరంగల్ బొల్లికుంట వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కమల్ యాదవ్ అధ్యక్షతన ఫార్మసిస్ట్ ఆస్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే అంశంపై రెండురోజులుపాటు నిర్వహించిన జాతీయ ఫార్మసీ వారోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జాతీయ శబ్ద మిమిక్రీ నిపుణుడు శ్రీనివాస్, మనశాస్త్ర నిపుణుడు జి.శివప్రసాద్, వాగ్దేవి విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్.వాణిదేవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. భారత ఔషధ రంగం అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిందని తెలిపారు. విద్యార్థులు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిగత అభివృద్ధి, లక్ష్యాలను అన్వేషించి ముందుకు వెళ్తే భవిష్యత్ అంతా ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో కళాశాల ప్రిఫెసర్ డాక్టర్, కె. శరీష, డాక్టర్ టి. రవి చంద్ర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నంది అవార్డు గ్ర హీత కేవీ.ప్రదీప్
ముగిసిన జాతీయ ఫార్మసీ వారోత్సవాలు


