సీసీఐ ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
న్యూశాయంపేట : పత్తి కొనుగోళ్లపై సీసీఐ విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, కపాస్ కిసాన్ యాప్‌ను తొలగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో హనుమకొండ జిల్లా కమిటీ సమావేశం బి.చక్రపాణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాన్ వెస్లీ హాజరై మాట్లాడారు. వర్షాల వల్ల రైతులకు అండగా ఉండాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు సమస్య పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రోజుకో నిబంధన పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని సూచించారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పి.సుదర్శన్‌రావు, నా యకులు ప్రభాకర్‌రెడ్డి, చుక్కయ్య, రాగుల రమేశ్, ఉప్పలయ్య, గొడుగు వెంకట్, వీరన్న, తిరుపతి, రాములు, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.


