ఆర్‌ఎంఎస్ కార్యాలయం తరలింపు
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే మెయిల్ సర్వీస్ (ఆర్‌ఎంఎస్) కార్యాలయం నిర్వహణను కాజీపేట పోస్టల్ శాఖ కార్యాలయ ప్రాంగణానికి తరలించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. 1965లో ఉత్తరాల బట్వాడాకు కాజీపేటలో పోస్టాఫీస్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం 1980లో కాజీపేట రైల్వేస్టేషన్‌లో రైల్వే మెయిల్ సర్వీస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అమృత్ భారత్ పనుల్లో భాగంగా ఆర్‌ఎంఎస్ కార్యాలయంలో కొంతభాగాన్ని తొలగించినట్లు చెప్పారు. కాజీపేట జంక్షన్‌లో ప్రస్తుతం స్పీడ్ పోస్టు హబ్ మాత్రమే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన ఆర్‌ఎంఎస్ కార్యాలయంతో అనుబంధం ఉన్న ఉద్యోగులు, ప్రజలు ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.


