మహాజాతర భద్రతకు ఎస్‌డీఆర్‌ఎఫ్..
గోవిందరావుపేట : మేడారం సమ్మక్క–సారక్క మహాజాతరకు లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో భద్రత చర్యలు చేపట్టేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ సిద్ధంగా ఉందని చల్వాయిలోని టీజీఎస్పీ 5వ బెటాలియాన్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. బెటాలియన్‌లో శుక్రవారం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమాండంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. జాతర సమయంలో భక్తుల భద్రతను ప్రాధాన్యంగా తీసుకొని ఎస్‌డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగానే ములుగు కలెక్టర్ దివాకర సమన్వయంతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం రామప్ప చెరువులో బో టింగ్ రైడ్, గజ ఈతగాళ్ల శిక్షణ (డీప్ డైవర్స్), నీటి విపత్తు నిర్వహణ (వాటర్ రెస్క్యూ) శిక్షణను చేపట్టి ందన్నారు. వాగులు, అటవీ మార్గాలు, రద్దీ కూడళ్ల వద్ద నిరంతరం పహారా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల భద్రతే తమ లక్ష్యమని, ఏ పరిస్థితికై నా వెంటనే స్ప ందించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సి ద్ధంగా ఉంటాయని అన్నారు. జాతర అవసరాల దృష్ట్యా సి బ్బందికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని అన్నారు. నీటి ప్రమాదాల నివారణ, భారీ జనసందోహంలో రక్షణ చర్యలు, అత్యవసర వైద్యసాయం, కమ్యూని కేషన్ వ్యవస్థల వినియోగం వంటి అంశాలపై వ్యా యామాలు నిర్వహించినట్టు తెలిపారు .ఆర్‌ఎస్సై రఘు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
5వ బెటాలియన్ కమాండెంట్
సుబ్రహ్మణ్యం


