‘ఎస్సెస్సీ’లో డిస్నీల్యాండ్ హవా
దామెర: ఎస్సెస్సీ ఫలితాల్లో డిస్నీల్యాండ్ పాఠశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగ్లాపూర్ సమీపంలోని డిస్నీల్యాండ్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ శోభారాణి బుధవారం తెలిపారు. పాఠశాలకు చెందిన తుత్తురు హర్షిణి, బానోతు శ్రీమాన్‌లు 569 మార్కులు సాధించారు. 47 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. 133 మంది విద్యార్థులకు గాను 130 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్లు ఆమె వెల్లడించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, బోధించిన ఉపాధ్యాయులను పాఠశాల ముఖ్యసలహాదారులు దయ్యాల మల్లయ్య, సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, డైరెక్టర్లు రాకేష్‌భాను, దీనేష్‌చందర్‌లు అభినందనలు తెలిపారు.
‘ఎస్సెస్సీ’లో డిస్నీల్యాండ్ హవా


