‘భూ భారతి’తో భూ సమస్యల పరిష్కారం
తొర్రూరు: ‘భూ భారతి’ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. భూ భారతి చట్టంపై మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓ గణేశ్‌తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత, భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి స్థానంలో భూ భారతి–2025 చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. గతంలో తహసీల్దార్ పరిష్కరించే చిన్న చిన్న భూ సమస్యలు సైతం కలెక్టర్ దృష్టికి వచ్చేవని, వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పరిష్కారంలో జాప్యం జరిగేదన్నారు. భూ భారతిలో దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉంటుందన్నారు. కొత్త చట్టంలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. ఆర్డీఓ నిర్ణయాన్ని కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయాన్ని ల్యాండ్ ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చన్నారు. భూ భారతి చట్టంతో పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ విజయ్‌చంద్ర, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ పూర్ణచందర్‌రెడ్డి, ఏఓ రాంనర్సయ్య, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారం..
పెద్దవంగర: భూ భారతి చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేకూరుతుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై తహసీల్దార్ మహేందర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. రైతుల దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. మేధావులు, అధికారులు, నిపుణుల సలహాలతో భూ భారతి చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. ధరణి పోర్టల్‌తో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ప్రస్తుత చట్టంతో ఎలాంటి ఇబ్బందులు, ఆలస్యం, పొరపాట్లకు తావులేకుండా రూ పొందించారన్నారు. అనంతరం మండల కేంద్రంలో ని పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఆర్డీఓ గణేశ్, ఏడీ ఎస్‌ఎల్‌ఆర్ నర్సింహమూర్తి, ఎంపీడీఓ వేణుమాధవ్, ఏడీఏ శ్రీనివాస్, ఏఓ స్వామి నాయక్, ఏపీఎం రమణాచారి, ఆర్‌ఐ లస్కర్, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, ఏఈఓలు, నాయకులు, నెహ్రూనాయక్ ఉన్నారు,
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్


