ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
దామెర: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన హనుకొండ జిల్లా దామెర మండలంలోని తక్కళ్లపహాడ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ తెలిపిక కథనం ప్రకారం.. నగరంలోని 3వ డివిజన్ ఆరెపల్లికి చెందిన సుంకరి వీరేందర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా శుక్రవారం పనినిమిత్తం తన అత్తగారి ఊరైన ఆగ్రంపహాడ్‌కు వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో దామెర మండలంలోని తక్కళ్లపహాడ్ పాఠశాల సమీపానికి రాగానే జాన్‌డీర్ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో వాహనంపై ఉన్న వీరేందర్ ఎగిరిపడ్డాడు. అనంతరం ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రగాయాలతో వీరేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని ట్రైయినీ ఎస్పీ మనన్ భట్, ఎస్సై అశోక్ పరిశీలించి, వివరాలు సేకరించారు. వీరేందర్ భార్య సుంకరి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.


