రైతులకు నేను వ్యతిరేకం కాదు | - | Sakshi
Sakshi News home page

రైతులకు నేను వ్యతిరేకం కాదు

Apr 8 2025 7:41 AM | Updated on Apr 8 2025 7:43 AM

ధర్మసాగర్‌: హనుమకొండ జిల్లాలో ఉన్న ఏకై క అటవీ సంపద దేవునూరు భూములను కా పాడడమే తనలక్ష్యమని, రైతులకు తాను వ్యతిరేకం కాదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ అధికా రులు రైతులకు సంబంధించిన భూములను ఇనుపరాతి గుట్టలు (దేవనూరు) అడవి సరిహద్దు దాటిన తరువాత చూపించాలని, ఇష్టానుసారంగా అడవి మధ్యలో చూపెట్టడం సరికాదని పేర్కొన్నారు. రై తుల పేరుతో ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు అన్యాయంగా అడవిలోకి చొరబడి అటవీ సంపదను నా శనం చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని, ఈ విషయాన్ని ప్రతీ రైతు గమనించాలని కోరారు. సర్వే పూర్తయింది కానీ, దాని ఫైనల్‌ రిపోర్ట్‌ రాలేదని అటవీశాఖ అధికారులు చెప్పారని వెల్లడించారు. ట్రెంచ్‌(కందకం)దాటి లోపలికి వచ్చి చదు ను చేయడంపై పరిశీలించడానికి వచ్చామని తెలిపా రు. కలెక్టర్‌ కూడా ఇందులో ఇన్‌వాల్వ్‌ అయ్యారనే విషయం తెలుస్తోందని, ఇప్పటికై నా సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తూ అటవీ సంపదను కాపాడాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement