కూతుళ్లే మహారాణులు | - | Sakshi
Sakshi News home page

కూతుళ్లే మహారాణులు

Mar 8 2025 1:54 AM | Updated on Mar 8 2025 1:50 AM

జఫర్‌గఢ్‌: కూనూర్‌ గ్రామానికి చెందిన ఈగ కృష్ణమూర్తి–శోభ దంపతులకు రమ్యకృష్ణ, సౌమ్యకృష్ణ ఇద్దరు కుమార్తెలు. కృష్ణమూర్తి ఇంటి ముందు చిన్న టీ కొట్టుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తెల ప్రాథమిక విద్య స్టేషన్‌ఘన్‌పూర్‌లో, ఇంటర్‌ హనుమకొండలోని ప్రైవేట్‌ కళాశాలలో చదివించాడు. పెద్దకూతురు రమ్యకృష్ణ హైదరాబాద్‌ వీఎన్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం చేస్తోంది. చిన్నకూతురు సౌమ్యకృష్ణ కూడా హైదరాబాద్‌ ఎంజీఐటీ కళాశాలలో బీటెక్‌, జేఎన్‌టీయూలో ఎంటెక్‌ పూర్తి చేసింది. ఈమె నాలుగు నెలల క్రితం నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. చిన్న తనం నుంచి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసిన అక్కాచెల్లెల్లు పట్టుదలతో చదివి కన్నవారి కష్టాలు దూరం చేశారు. పిల్ల లు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులయ్యారని, ఆడపిల్లలైనా మగ పిల్లలు లేని లోటు తీర్చారంటూ ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

కూతుళ్లతో తల్లిదండ్రులు తిరుపతి,సరిత

టేకుమట్ల: కూతుళ్లయితే ఏంటి వారిని ఝాన్సీరాణి మాదిరి తీర్చిదిద్దడమే మా బాధ్యత అంటున్నారు టేకుమట్ల మండలంలోని పెద్దంపల్లికి చెందిన శాస్త్రాల తిరుపతి–సరిత దంపతులు. వారి ఇద్దరు కుమార్తెలు వర్థినిసేన తొమ్మిదో తరగతి చదువుతుండగా.. ధైర్యసేన రెండో తరగతి చదువుతోంది. వర్థినిసేనకు కరాటే, కర్రసాము, క్లాసికల్‌ డ్యాన్స్‌, సింగింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ అండర్‌–14 కరాటే విభాగంలో తెలంగాణ నుంచి వర్థినిసేన పాల్గొంది. చిన్న కూతురు ధైర్యసేనకు సైతం పలు రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు.

కూతురంటేనే ఇష్టం

ఖానాపురం: తమకు కూతురంటేనే ఇష్టం అంటున్నారు ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పేరాల హరీశ్‌రావు–కల్పన దంపతులు. పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న వీరికి కుమార్తె అంజనారావు పుట్టగానే ఆమైపె ఇష్టంతో ఇక పిల్లలు వద్దనుకున్నారు. ఆమెను ఐపీఎస్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని చదివిస్తున్నారు, ఐదేళ్ల ప్రాయం నుంచే కరాటేలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎన్ని ఆటంకాలెదురైనా కుమార్తెను ఐపీఎస్‌గా చూడాలన్నదే తమ కోరిక అని వారు చెబుతున్నారు.

కొందరు ఒక్కరితోనే సరి..

మరికొందరికి ఇద్దరు కూతుళ్లు

వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న పేరెంట్స్‌

మగపిల్లలు లేని లోటు తీరుస్తున్నారంటున్న

తల్లిదండ్రులు

కూతుళ్లే మహారాణులు1
1/3

కూతుళ్లే మహారాణులు

కూతుళ్లే మహారాణులు2
2/3

కూతుళ్లే మహారాణులు

కూతుళ్లే మహారాణులు3
3/3

కూతుళ్లే మహారాణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement