రూ.7.14 లక్షల నగదు పట్టివేత | Sakshi
Sakshi News home page

రూ.7.14 లక్షల నగదు పట్టివేత

Published Fri, Apr 19 2024 1:40 AM

రామన్నపేట: వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు - Sakshi

రామన్నపేట : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పోలీసులు గురువారం పలుచోట్ల వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో ఆధారం లేకుండా తరలిస్తున్న నగదు మొత్తం 7.14 లక్షల నగదు పట్టుకున్నారు. వరంగల్‌ ఏసీపీ బి.నందిరాం ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పోచమ్మమైదాన్‌ సెంటర్‌లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇందులో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌కు చెందిన బండారి మణికంఠ నుంచి రూ.2.80 లక్షలు, షేక్‌ జిజ్వాద్‌ వద్ద రూ.84 వేలు, నద్దునూరి రవి వద్ద రూ.63 వేలు, తుపాకుల శ్రీకాంత్‌ వద్ద రూ.56వేలు, సార భాస్కర్‌ వద్ద రూ.54వేలు.. మొత్తం రూ.4.65 లక్షలు స్వాధీనం చేసుకుని ఎలక్షన్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం ఇన్‌చార్జ్‌కు అప్పగించారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌లో రూ.లక్ష..

స్టషన్‌ఘన్‌పూర్‌: స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద గురువారం నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ. లక్ష నగదు పట్టుకున్నట్లు సీఐ ముస్క రాజు తెలి పా రు. మండలంలోని మాన్‌సింగ్‌తండాకు చెందిన భూక్య రవీందర్‌ బైక్‌పై ఘన్‌పూర్‌ నుంచి మాన్‌సింగ్‌ తండాకు వెళ్తుండగా తనిఖీ చేసినట్లు పేర్కొన్నా రు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేని రూ.లక్ష లభించడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

చిల్పూరులో రూ.1.49 లక్షలు..

చిల్పూరు: మండల పరిధి వెంకటాద్రిపేట–తరిగొప్పుల రోడ్డులో గురువారం రూ.1.49 లక్షల నగదును సీజ్‌ చేసినట్లు ఎస్సై ముత్యం రాజేందర్‌ తెలిపారు. వెంకటేశ్వరపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా చిల్పూరు పంచాయతీ పరిధి వడ్డెగూడేనికి చెందిన కస్తూరి వెంకట్రాజం బైక్‌పై వెళ్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేసినట్లు చెప్పారు. ఆధారాలు లేని నగదు పట్టుకుని సీజ్‌ చేసినట్లు వివరించారు.

1/1

Advertisement
 
Advertisement