
ఖానాపురం గ్రామ శివారులో ధాన్యపు రాశులు
తొర్రూరు రూరల్: మండలంలోని అన్ని గ్రామాల్లో వరి పంట దిగుబడి ప్రారంభం కావడంతో ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన ఎక్కడ చూసిన ధాన్యం రాశులు పేరుకుపోయి కనిపిస్తున్నారు. గ్రామాల్లో బావులు, బోర్లు, చెరువు, కుంటల కింద రైతులు సుమారు 3వేల హెక్టర్ల వరి పంటను సాగు చేశారు. అయితే 20 రోజుల నుంచి ధాన్యం చేతికొస్తోంది. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాగా ఇటీవల వాతావరణం చల్లబడటం, సాయంత్రం ఊదురుగాలులు వీయడంతో.. అకాల వర్షాలు కురుస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందిం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం
రైతులకు తప్పని ఎదురుచూపులు