సంగెం–చింతలపల్లి మధ్యలో వరంగల్–విజయవాడ రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణ జాప్యం వల్ల నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. కాట్రపల్లి–వెంకటాపూర్, చింతలపల్లి–పల్లారుగూడ, మొండ్రాయి–పల్లారుగూడ, మొండ్రాయి–నల్లబెల్లి మధ్యలో లోలెవల్ కాజ్‌వేల నిర్మాణం లేకపోవడంతో వానాకాలంలో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఎల్గూరురంగంపేట చెరువు మత్తడిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. మండలంలో డిగ్రీకళాశాల ఏర్పా టు చేయాలి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని అప్‌గ్రేడ్ చేయాలి. చెరువులు, కుంటలకు గేట్లు ఏర్పాటు చేయాలి. పంట కాల్వలకు లైనింగ్ ఏర్పాటు చేయాలి. గురుకుల పాఠశాలలకు పక్కాభవనాలు నిర్మించాలి.