రైలుబోగీల్లోనే 10 గంటలు.. | - | Sakshi
Sakshi News home page

రైలుబోగీల్లోనే 10 గంటలు..

Jul 28 2023 2:28 AM | Updated on Jul 28 2023 7:49 AM

- - Sakshi

మహబూబాబాద్‌: ఎడతెరిపిలేని వర్షాలతో కాజీపేట టౌన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని వడ్డేపల్లి చెరువు రిజర్వాయర్‌పై నిర్మించిన రైల్వే వంతెన ట్రాక్‌పైకి వరద నీరు ఉధృతంగా చేరడంతో గురువారం రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో సుమారు 10గంటలపాటు ప్రయాణికులు రైలు బోగీల్లోనే నిరీక్షించారు.

వడ్డెపల్లి చెరువు కట్టపై 364/27–25 కి.మీ నంబర్‌ వద్ద రైల్వే ట్రాక్‌ డేంజర్‌గా మారడంతో కాజీపేట టౌన్‌ రైల్వే స్టేషన్‌లో తిరుపతి–కరీంనగర్‌, ఎర్నాకులం–బిలాస్‌పూర్‌, యశ్వంత్‌పూర్‌–లక్నో, బెంగళూర్‌–నిజాముద్దీన్‌ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఉదయం 10:30 గంటల నుంచి నిలిపివేశారు. కాజీపేట–ఢిల్లీ, వరంగల్‌–ఢిల్లీ అప్‌ అండ్‌ డౌన్‌ రూట్‌లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు.

సికింద్రాబాద్‌ బ్రిడ్జి, ట్రాక్‌ ఇంజనీర్స్‌, కాజీపేట జంక్షన్‌కు చెందిన అధికారులు వడ్డెపల్లి రైల్వే ట్రాక్‌ వద్ద నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ట్రాక్‌ సామర్థ్యం టెస్టింగ్‌ కోసం ట్రాక్‌పై గూడ్స్‌ రైలును నిలిపి ఉంచారు. రాత్రి 8 గంటల వరకు ఇదే పరిస్థితిలో రైల్వే అధికారులు సెక్యూరింగ్‌ చేశారు. కాగా కాజీపేట రైల్వే చరిత్రలో వడ్డెపల్లి చెరువు రైల్వే ట్రాక్‌పైకి వరద నీరు చేరడం ఇదే మొదటిసారి. అయితే రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు రైలు పట్టాలపై నడుచుకుంటూ సమీప దుకాణాల వద్దకు వెళ్లి తిను బండారాలు కొనుగోలు ఆకలితీర్చుకున్నారు.

వరంగల్‌ సమీప గ్రామాల ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లిపోయారు. సుమారు 10గంటల తర్వాత గురువారం రాత్రి రైళ్ల రాకపోకలకు రైల్వే అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ట్రాక్‌ వద్ద వరద ప్రవాహం తగ్గడంతో రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు ట్రాక్‌ కెపాసిటిని పరిశీలించి మొదటి, రెండో లైన్‌లకు రాత్రి 8:30 గంటలకు క్లీయర్‌ ఇచ్చారు. ముందుగా లైట్‌ ఇంజన్‌ నడిపించి ఆతర్వాత 10 నుంచి 30 కెంఎంపీహెచ్‌ స్పీడ్‌తో ఢిల్లీ వైపు యశ్వంత్‌పూర్‌– బిలాస్‌పూర్‌, తర్వాత రాజధా, లక్నో, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లను పంపించినట్లు తెలిపారు.

కాజీపేట జంక్షన్‌ జలమయం

వర్షపునీరు కాజీపేట జంక్షన్‌లోని టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్దకు, ఎంట్రెన్స్‌ ఎదుట, ప్లాట్‌ఫాం పైకి చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

► న్యూ ఢిల్లీ వెళ్లే ఏపీ, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అధికారులు గురువారం ఉదయం 11.30 గంట ల సమయంలో వరంగల్‌ రైల్వే స్టేషన్‌ రెండు, మూడు ప్లాట్‌ ఫాంలలో నిలిపివేశారు. రైళ్లలో శు క్రవారం ఐఐటీ ఢిల్లీ కళాశాలలో చేరేందుకు వెళ్తు న్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం చైన్నె నుంచి న్యూఢిల్లీ వెళ్లే గ్రాండ్‌ ట్రంక్‌(జీటీ) ఎక్స్‌ప్రెస్‌కు వరంగల్‌ రైల్వే స్టేషన్‌లో ప్లా ట్‌ ఫాం రేకు తగలడంతో రైలు ఆగిపోయింది.

► రఫ్తీసాగర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (గోర్కపూర్‌– కొచువేలి) రైలు నెక్కొండ రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం 11గంటలకు నిలిచిపోయింది. స్టేషన్‌లో ఎలాంటి సౌకర్యాలు లేక పోవడం.. తినుబండారులు సైతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యామని ప్రయాణికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement