చేతిలోని స్మార్టు ఫోన్ పోగొట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో వినియోగదారులకు విధితమే. ఈ నేపథ్యంలో పాత, పాడైపోయిన స్మార్టుఫోన్ల ఇస్తే కొత్త ట్రావెల్ బ్యాగులిస్తామంటూ గ్రామాల్లో కొందరు వ్యాపారులు తిరుగుతున్నారు. బ్యాగుల కోసం ఆశపడి కొంత మంది మహిళలు ఇంట్లో నిరుపయోగంగా ఉన్న, పాడైపోయిన స్మార్టు ఫోన్లు వారికిచ్చి బ్యాగులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పాత సెల్‌ఫోన్లను వారు ఎం చేస్తారోననే ప్రశ్న వారిని కలచివేస్తోంది. వాటి విడి భాగాలను తీసి విక్రయిస్తారా? లేక ఫోన్‌లోని డేటాను సేకరించి దుర్వినియోగం చేస్తారా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి.
– జూపాడుబంగ్లా


