డీపీలకు ఎక్కని నీరు | - | Sakshi
Sakshi News home page

డీపీలకు ఎక్కని నీరు

Nov 18 2026 1:02 AM | Updated on Nov 18 2026 1:02 AM

హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ (ఎల్ల్సెల్సీ) హొళగుంద సెక్షన్‌లో గడిచిన వారం రోజులుగా నీటి ప్రవాహం తగ్గుతూ డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీరు ఎక్కకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన రైతులు మంగళవారం ఎల్లెల్సీ 193 కి.మీ వద్ద ఉన్న కొటెహాళ్‌ డిస్ట్రిబ్యూటరీ కాలువ వద్దకు చేరి ప్రధాన కాలువ షట్టర్లను దింపి నీటిని మళ్లించాలని టీబీ బోర్డు అధికారులకు మొర పెట్టుకున్నారు. వారు నిరాకరించడంతో నిరాశకు గురయ్యారు. రూ.లక్షలు ఖర్చుపెట్టి సాగు చేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతాయని ప్రధాన కాలువలో నీటిమట్టం పెంచేందుకు చర్యలు చేపట్టాలని రైతులు ఉలిగేష్‌, నాగప్ప, వీరేంద్ర, పంపన్న, సిద్దప్ప, మల్లికార్జున తదితరులు తమగోడును విలేకరుల ముందు మొరపెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్‌, టీబీ బోర్డు ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి రైతులను ఆదుకోవాలని వేడుకున్నారు. ఒకపక్క ఎల్‌నినో ప్రభావంతో మెట్టభూముల్లో సాగు చేసిన పంటలు దెబ్బతిని నష్టపోయిన తమకు కాలువ కింద ఆరుతడి పంటలు వేసుకుని గట్టెక్కుదామని ఆశిస్తే ఇప్పుడు నీటిమట్టం పూర్తిగా పడిపోయి సాగునీరందని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. కాగా ఈ నెల 20న ఎల్లెల్సీకి నీటి సరఫరా పూర్తిగా నిలిపి వేయనుండగా ప్రస్తుతం కాలువలో రెండడుగుల మేర కేవలం 200 క్యూసెక్కులు మాత్రమే నీటి ప్రవాహం ఉండడంతో జొన్న, మిరప, మొక్కజొన్న తదితర పంటలకు ఇంకా నీటి తడులు అవసరం కావడంతో పంటలను ఎలా కాపాడుకోవలో అర్థం కాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టీబీ డ్యాం నుంచి ఎల్లెల్సీకి 1,660 క్యూసెక్కులను వదులుతున్నా ఆంధ్రాకు 150 క్యూసెక్కులు కూడా చేరడం లేదు.

కర్ణాటకలో జలచౌర్యంతో ఎల్లెల్సీలో తగ్గుతున్న నీటిమట్టం

ఎల్లెల్సీ కర్ణాటక పరిధిలో బాగేవాడి, కూరిగనూరు, సూగూరు, గుండ్లకెరే, కరూరు, కరుగోడు, మోకా తదితర ప్రాంతాల్లో రైతులు వాగులు, వంకలు, చెరువులకు నీటిని మళ్లించుకుంటున్నారు. అంతేగాక భారీగా నానాయకట్టును సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాలువలో తక్కువ స్థాయిలో వస్తున్న నీటిలో అధిక శాతం కర్ణాటక రైతులు వాడేస్తున్నారు. కర్ణాటకలో యథేచ్ఛగా సాగుతున్న జల చౌర్యం కారణంగా నీటిమట్టం తగ్గుతున్నట్లు ఇక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా టీబీ డ్యా ంలో మంగళవారం ఉదయం 1633 అడుగులకు గాను 1604 అడుగులతో 105.788 టీఎంసీలకు గాను 27 టీఎంిసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement