బనగానపల్లె: లా పరీక్ష రాసేందుకు హఖీంఖాసీం (44) కుమారుడు హఖీందానిష్‌తో కలిసి బైక్‌పై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు హఖీందానిష్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు.. బనగానపల్లెకు చెందిన హఖీంఖాసీం కర్నూలులో లా చదువుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కర్నూలులో పరీక్ష ఉండడంతో కుమారుడు హఖీందానిష్‌తో కలిసి బైక్‌పై బయల్దేరారు. మండలంలోని యనకండ్ల గ్రామ సమీపంలో జీఎన్‌ఎస్‌ఎస్ కాల్వ వంతెన వద్ద వెనుక వైపు నుంచి మలుపు తిరుగుతూ టిప్పర్‌లారీ బైక్‌ను ఢీకొట్టడంతో హఖీంఖాసీం అక్కడిక్కడే మృతి చెందగా కుమారుడు హఖీందానిష్ తీవ్రగాయాల పాలయ్యారు. బాధితుడిని చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. మృతుడు వాటర్ ప్లాంట్‌తో పాటు రెడీమెడ్ దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. గాయపడిన హఖిందానిష్ ఇంటర్ చదువుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.


