ఎకై ్సజ్ పోలీసుల సోదాలు
డోన్ రూరల్: పంచాయతీ ఎన్నికల నైపథ్యంలో అక్రమ మద్యం, సారా విక్రయాలను అడ్డుకునేందుకు ఎకై ్సజ్ శాఖ అధికారులు శనివారం డోన్ పట్టణంతో పాటు ప్యాపిలి మండలంలో విస్తృత దాడు లు చేశారు. ప్యాపిలి మండలంలోని అలేబాద్తండా లో అధికారులు విస్తృతంగా ఇళ్ల తనిఖీలు చేపట్టగా ఎలాంటి అక్రమ మద్యం నిల్వలు లభించలేదని డోన్ ఎకై ్సజ్ సీఐ జాఫ్రుల్లా తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎన్నికల వేళ నాటుసారా,మత్తు పదార్థాల విక్రయాలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామని, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
బెల్ట్ షాపు నిర్వాహకుల అరెస్టు..
డోన్ పట్టణంలో నిర్వహించిన తనిఖీల్లో రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ జఫ్రుల్లా తెలిపారు. వారి వద్ద 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆరుగురిపై బైండోవర్ కేసులు నమోదు చేసి డోన్ తహసీల్దార్ ఎదుట హాజరుపరచామన్నారు. ఈ దాడుల్లో నంద్యాల స్క్వాడ్ సీఐ లక్ష్మణ్ దాస్, ఎస్ఐలు సోమశేఖర్, దౌలత్ ఖాన్, ట్రైనీ ఎస్ఐలు వెంకటేశ్వర్లు, అన్వేష్‌తో పాటు సిబ్బంది రంగస్వామి, గోపాల్ సింగ్, ఉమాకాంతరెడ్డి, శ్రీనివాస్, ఓబులేసు, అల్లాస్వామి, నాగరాజు పాల్గొన్నారు.


