కేవీఆర్‌లో డిగ్రీ స్పాట్‌ అడ్మిషన్స్‌ | - | Sakshi
Sakshi News home page

కేవీఆర్‌లో డిగ్రీ స్పాట్‌ అడ్మిషన్స్‌

Nov 20 2026 1:37 AM | Updated on Nov 20 2026 1:37 AM

కర్నూలు సిటీ: క్లస్టర్‌ విశ్వవిద్యాలయ పరిధిలోని కేవీఆర్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో యూజీ(డిగ్రీ) ప్రోగ్రాముల్లో మిగిలిపోయిన సీట్లు స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.భారతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 22వ తేది వరకు కొనసాగుతుందని.. అర్హులు, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో కళాశాలను సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు 9908349685, 9441336078 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

జెడ్పీ మీటింగ్‌ హాల్‌ ముస్తాబు

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌కు ఈ నెల 20న కొత్త పాలకవర్గం కొలువుదీరనున్న నేపథ్యంలో జెడ్పీ సమావేశ భవనాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇదే భవనంలో కొత్తగా ఎన్నికై న జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారం, జెడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను నిర్వహించనున్న దృష్ట్యా సమావేశ భవనం పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించారు. అలాగే సమావేశ భవనానికి పెయింటింగ్‌ చేయించడంతో పాటు మీటింగ్‌ హాల్‌లో, బయట కార్పెట్లు పరిచి కొత్త అందాలను తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి ఆధ్వర్యంలో ఈ నెల 20న తొలి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

డీఎస్సీ పోస్టులకు ఉచిత ఆన్‌లైన్‌ శిక్షణ

కర్నూలు(అర్బన్‌): డీఎస్సీ(ఎస్‌జీటీ/స్కూల్‌ అసిస్టెంట్‌) పోస్టులకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణకుదరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కె.ప్రసూన తెలిపారు. శిక్షణకు జిల్లాకు చెందిన బీఎడ్‌, టీటీసీ, ఏపీ టెట్‌లో అర్హత సాధించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు అర్హులని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను బీసీ స్టడీ సర్కిల్‌కు స్వయంగా వచ్చి తమ బయోడేటాతో పాటు 2 ఫోటోలు, విద్య, కుల, ఆదాయం(రూ.లక్ష లోపు ) ధృవీకరణ పత్రాలు, ఆధార్‌, పాన్‌కార్డు జీరాక్స్‌ కాపీలతో ఈ నెల 25వ తేది సాయంత్రం 4 గంటల్లోపు అందజేయాలన్నారు. ఆన్‌లైన్‌ శిక్షణా తరగతులను బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. వివరాలకు 08518– 236076 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.

28న నవోదయ ప్రవేశ పరీక్ష

ఎమ్మిగనూరు రూరల్‌: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల 28న బనవాసి జవహర్‌ నవోదయలో 6వ తరగతి ప్రవేశానికి 28 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు విద్యాలయం ప్రిన్సిపాల్‌ ఇ.పద్మావతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 16, నంద్యాల జిల్లాలో 12 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికి 6,970 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్ల తెలిపారు. ఈ నెల 23న కర్నూలు మాంటిస్సోరి స్కూల్‌ (ఏ క్యాంప్‌)లో పరీక్ష విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు శిక్షణనిస్తామన్నారు. అభ్యర్థులకు సందేహాలుంటే 08512–229454, 965230633, 9985738899 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

డిసెంబర్‌ 22న సర్‌ తుది జాబితా

కర్నూలు(సెంట్రల్‌): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్‌ తుది జాబితా డిసెంబర్‌ 22న విడుదల చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో సర్‌ ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారు తమ వివరాలను స్థానిక బీఎల్‌ఓలను కలసి అందజేయాలని ఆమె సూచించారు.

చేనేత సంఘాలకూ ఎన్నికలు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఇప్పటికే సహకార ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సహకార సంఘాల్లో ఉన్న సభ్యుల ఈ–కేవైసీ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. తాజాగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు సైతం నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ రేఖరాణి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ చేనేత సహకార సంఘాల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. డిసెంబర్‌ నెల చివరికి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు. కాగా కర్నూలు జిల్లాలో ఎనిమిది, నంద్యాల జిల్లాలో 28 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించవచ్చని గత ఏడాది జిల్లా చేనేత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వీటిల్లో చాలా వరకు సంఘాలు పని చేయడం లేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement