శ్రీశైలంటెంపుల్: కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని పలువురు భక్తులు శ్రీశైల క్షేత్రానికి చేరుకుని కార్తీక దీపారాధన, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం పలువురు భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. ముందుగా పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక దీపారాధన వేదికపై కార్తీక దీపాలను వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.


