సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటున్నవైఎస్సార్సీపీ శ్రేణులు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గట్టి పోటీ
ఉమ్మడి జిల్లాలో పది జెడ్పీటీసీ, ఐదు ఎంపీపీ స్థానాలు దక్కించుకున్నవైఎస్సార్సీపీ
నందికొట్కూరు, బేతంచెర్ల మున్సిపాలిటీల్లో విజయం
నంద్యాల, డోన్ మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ గెలిచినా డిక్లేర్ చేసుకున్న పచ్చపార్టీ
పోలీసు బెదిరింపులు.. అధికారంతో పచ్చ అరాచకం
అయినా వెనకడుగువేయక గట్టి పోటీ ఇచ్చిన ౖవైఎస్సార్‌సీపీ శ్రేణులు
గెలిచినట్టు ప్రకటించుకున్నాసంబరాలకు దూరంగా పచ్చ పార్టీ
గెలుపొందిన గోస్పాడు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు
చంద్రబాబు ప్రభుత్వం గడిచిన రెండున్నరేళ్ల పాటు అధికారంలో ఉన్నా ఇచ్చిన మాట మేరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించలేక పోయింది. పట్టణ ప్రాంతాల్లో సంగతి దేవుడెరుగు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలకు తాగునీటిని అందించలేకపోతోంది. శ్రీశైలం జలాశయంలో ఉన్న నీళ్లను తెలంగాణ ప్రభుత్వం తరలించుక వెళ్లినా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపలేదు. కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమలో ఒక్క పంటకు కూడా నీళ్లివ్వక మొండిచేయి చూపింది. బాబు సర్కార్ సృష్టించిన కరువుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బియ్యం మొదలు నిత్యావసరాల ధరలు నింగినంటినా ప్రభుత్వం చర్యలు లేవు. గ్రాసం దొరక్క పశువులను కబేళాలకు అమ్ముకొని పొట్టచేత పట్టుకొని ప్రజలు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఇది సర్పంచ్ ఎన్నికలలో తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రజా
వ్యతిరేకత
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో మున్సిపోల్స్‌తో మొదలుపెట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పచ్చపార్టీని గట్టిగా ఢీకొట్టిన వైఎస్సార్సీపీ సర్పంచు ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమైంది. ఇటీవల ముగిసిన మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోరాటం స్ఫూర్తిగా పల్లె పోరులో వెనకడుగు లేదంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఢీ అంటే ఢీ అంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాబలంతో ఉన్న వైఎస్సార్సీపీ అధికార పచ్చపార్టీని ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కర్నూలులో 484, నంద్యాలలో 488 చొప్పున 972 సర్పంచ్ స్థానాలుండగా.. ఈ నెల 13 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నవంబర్ 26, 29.. డిసెంబర్ 2 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ జరగనుంది. అన్నింటిలో పోటీకి వైఎస్సార్సీపీ సన్నద్ధమైంది. అధికార పార్టీ బెదిరింపులకు తలొగ్గక అమీతుమీకి సిద్ధమవుతోంది.
అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టి దౌర్జన్యానికి దిగినా ప్రజల తీర్పు వారికి వ్యతిరేకంగా ఉండనుంది. మున్సిపోల్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపొందినట్లు చూపించుకోవాలని అధికార పార్టీ పలు రకాల అక్రమాలకు తెగబడింది. అయితే వైఎస్సార్సీపీ శ్రేణులు ఎదురొడ్డి నిలిచిన చోట పచ్చపార్టీకి భంగపాటు తప్పలేదు. నంద్యాల జిల్లాలోని నందికొట్కూ రు మున్సిపాలిటీలో వచ్చిన ఫలితాలు ఇందుకు ఉదా హరణ. ఇక్కడ పచ్చపార్టీ ఘోర ఓటమి చవిచూడక తప్పలేదు. అలాగే కోట్ల సుజాతమ్మ మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసిన డోన్‌లో వైఎస్సార్సీపీ విజయం సాధి ంచినా లెక్కించిన ఓట్లను తిరిగి లెక్కించి గెలిచినట్లు ప్రకటించుకున్నారు. నంద్యాల మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధించగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి జిల్లా ఉన్నతాధికారికి ఫోన్ చేసి ఒత్తిడితెచ్చి పచ్చపార్టీ గెలిచినట్లు ప్రకటించుకున్నారు. బేతంచెర్లలో వైఎస్సార్సీపీ గెలిచింది. చాలా మున్సిపాలిటీలలో వైఎస్సార్ సీపీ గెలిచినా అధికారం అడ్డుపెట్టి పచ్చపార్టీ గెలిచిన ట్లు ప్రకటించుకోవడం గమనార్హం. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో అధికార పార్టీ అక్రమాలకు తెగబడింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులను పోలింగ్ బూత్‌ల్లోకి రానివ్వలేదు. కొన్నిచోట్ల ఓటర్లను పోలింగు కేంద్రాల దరిదాపులకు కూడా రానివ్వలేదు. మరికొన్ని చోట్ల వైఎస్సార్సీపీ వారిపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ గెలిచిన చోట్ల రీ కౌంటింగ్ పేరు తో తమ అభ్యర్థులు గెలిచినట్లు పచ్చపార్టీ ప్రకటించుకుంది. అన్ని అక్రమాలకు పాల్పడినా ఎదురొడ్డి నిలిచిన ప్రతిచోటా వైఎస్సార్సీపీ విజయం సాధించింది.
అధికారం అడ్డుపెట్టి అక్రమాలు
సర్పంచ్ పోరుకు సన్నద్ధం
గెలిచి చూపించారు:
ఉమ్మడి జిల్లాలో ఆదోని–1, ఆస్పరి, కోడుమూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నంద్యాల, గోస్పా డు, పాములపాడు, ప్యాపిలి, బండి ఆత్మకూరుతో కలిపి మొత్తం 10 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకో గా జిల్లాలో మొత్తం 809 ఎంపీటీసీలకు గాను 257 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. ఇక కోడుమూరు, నంద్యాల, గోస్పాడు, మిడుతూరు, కొత్తపల్లి, పాములపాడు మండల పరిషత్‌లను సైతం వైఎస్సార్సీపీ గెలుచుకుంది. టీడీపీ గెలిచినట్లు ప్రకటించుకున్న స్థానాల్లో పచ్చనేతలు డిక్లరేషన్ ఫారాలు తీసుకొని మౌనంగా వెళ్ల డం మినహా ఎటువంటి సంబరాలు చేసుకోకపోవడం చూస్తుంటే వారి గెలుపుపట్ల ప్రజల్లో ఏ స్థా యి వ్యతిరేకత ఉందో తెలుస్తుంది. మిగిలిన ఎన్నికలు లాగే సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి నిలబడితే గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయం వైఎస్సార్సీపీ శ్రేణులకు తెలుసు. అందుకే పల్లెపోరులో పోటీకి ఆ పార్టీ సై అంటోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్యనేతలు ఎన్నికల్లో పోటీకి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.


