నేటి నుంచి పది పరీక్షల ఫీజు చెల్లింపు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పది పరీక్షల ఫీజు చెల్లింపు

Nov 11 2026 12:55 AM | Updated on Nov 11 2026 12:55 AM

కర్నూలు సిటీ: వచ్చే ఏడాది మార్చిలో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు నేటి నుంచి ఫీజు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. ఫీజులు htt ps:// bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ల్లోని ఆయా స్కూల్‌ లాగిన్‌ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 25లోపు చెల్లించ్చవన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేది వరకు, రూ.200 అపరా ధ రుసుముతో వచ్చే నెల 3 నుంచి 9వ తేది వరకు, రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 10 నుంచి 15వ తేదిలోపు చెల్లించవ్చన్నా రు. రెగ్యులర్‌ విద్యార్థులకు రూ.125, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్‌ అయిన వారు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రూ.110, ఒకేషనల్‌ విద్యార్థులకు రూ.125కు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అండర్‌ ఏజ్‌ మినహాయింపునకు రూ.300 చెల్లించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ఆర్‌యూలో విద్యార్థుల మధ్య వివాదం

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ యూనివర్సిటీలో సీనియర్స్‌, జూనియర్స్‌ మధ్య చిన్నపాటి వివాదం ర్యాగింగ్‌కు దారి తీసింది. వర్సిటీ హాస్టల్‌లో గత నాలుగు రోజులుగా పీజీ ఫస్ట్‌ ఇయర్‌ బయోటెక్నాలజీ విద్యార్థిఽని పీజీ రెండో సంవత్సరం బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ విద్యార్థులు ర్యాగింగ్‌ చేసినట్లు తెలిసింది. సదరు విద్యార్థి వర్సిటీ టీచింగ్‌ ఫ్యాకల్టీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో విషయం తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు వర్సిటీ సమీపంలో ఉన్న వారి బంధువులకు చెప్పడంతో వారు సోమవారం రాత్రి వర్సిటీకి చేరుకున్నారు. అక్కడి ఉద్యోగులు రాత్రి సమయంలో ఎందుకు ఉదయం వచ్చి వర్సిటీ అఽధికారులతో మాట్లాడమని చెప్పడంతో వెనక్కు వెళ్లిపోయారు. మంగళవారం కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ మొదటి సంవత్సరం విద్యార్థి సైతం సీనియర్స్‌పై వర్సిటీ రిజిస్ట్రార్‌, ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమైన వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.విజయ్‌కుమార్‌ నాయుడును వివరణ కోరగా ర్యాగింగ్‌ జరగలేదన్నారు. ఇంట్రడక్షన్‌లో భాగంగా జూనియర్‌కు సంబంధించిన ఎడ్యుకేషన్‌ తదితర వివరాలను సీనియర్స్‌ అడిగారని, దీంతో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి ఒత్తిడికి లోనయ్యాడన్నారు. విద్యార్థులందరికీ కౌన్సెలింగ్‌ ఇస్తున్నామని, క్లోజ్‌ మానిటరింగ్‌ చేస్తామన్నారు. ఇద్దరు టీచింగ్‌ ఫ్యాకల్టీతో ఆకస్మిక తనిఖీలు చేయిస్తున్నట్లు వెల్లడించారు.

శ్రీగిరిలో కార్తీక రద్దీ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీకమాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. పరమేశ్వరునికి ప్రీతికరమైన మాసం కావడంతో శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు బారులుదీరారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజా ము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆ లయ ఉత్తరద్వారం, గంగాధర మండపం వద్ద దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యే క దీపారాధన వేదిక వద్ద భక్తులు ప్రత్యేక నోము లు నోచుకున్నారు. అనంతరం ఆలయ క్యూలైన్ల ద్వారా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయం మారుమోగింది.

నంద్యాల డెమూ

నందలూరు వరకే

కోవెలకుంట్ల: నంద్యాల– ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు ప్రతి రోజు నడిచే డెమూ రైలును (77211) మంగళవారం నుంచి వైఎస్సార్‌జిల్లా నందలూరు వరకే కుదించారు. రేణిగుంట యూడ్‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు చేపడుతున్న దృష్ట్యా ఈ మార్గంలో రైలు ప్రయాణ సేవలను తగ్గించారు. నంద్యా లలో ఉదయం 6 గంటలకు బయలుదేరే డెమూ బనగానపల్లె, కోవెలకుంట్ల, నొస్సం, వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూ రు, ఎర్రగుంట్ల, కడప మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు రేణిగుంట చేరుకునేది. తిరిగి అక్కడ మధ్యాహ్నం 1.45 గంటలకు బయ లుదేరి ఇదే మార్గంలో రాత్రి 8.45 గంటలకు నంద్యాలకు వచ్చేది. రేణిగుంట స్టేషన్‌ మరమ్మతుల దృష్టా డిసెంబర్‌ 27 వరకు ఈ రైలు నందలూరు వరకు మాత్రమే నడుస్తుందని రైల్వేశాఖ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement