దమ్ముంటే ఎన్నికలు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ
కర్నూలు(టౌన్): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనూహ్య విజయం సాధించిందని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం సిగ్గు చేటని, దమ్ముంటే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లో 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం అబద్దాలు చెప్పేందుకు ఉపయోగపడుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు, మహిళా అభ్యర్థులపై దాడులు, నామినేషన్లు వేయకుండా బలవంతంగా లాక్కున్న ఘటనలు, వైఎస్సార్సీపీ నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించడం, లక్ష లాది బైండోవర్ కేసులు నమోదు చేసి స్టేషన్లను తరలించడం చేశారన్నారు. నామినేషన్లు ముగిసిన తరువా త పోలింగ్ రోజు యథేచ్ఛగా పోలింగ్ కేంద్రాల వద్దే డబ్బులు పంపిణీ, బూత్‌లను ఆక్రమించుకొని భారీగా రిగ్గింగ్ చేయడం ప్రపంచమంతా చూసిందన్నారు.
రీపోలింగ్ లేదా రీ కౌంటింగ్ వెళ్లే దమ్ముందా?
కర్నూలులో మంత్రి స్థాయిలో అధికార పార్టీ నేతలు అక్రమాలు, దాడులు, బైండోవర్ కేసులు పెట్టి ఎన్నికలు నిర్వహించారన్నారు. కౌంటింగ్ కేంద్రంలో గంట ల కొద్ది మంత్రికి ఏం పని అన్నారు. 23వ వార్డు అభ్యర్థి 58 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందితే రీకౌంటింగ్ పేరుతో తిరస్కరణకు గురైన ఓట్లు కలిపి టీడీపీ గెలిచినట్లు డిక్లరేషన్ ప్రకటించారన్నారు. 50 వార్డు, 52వ వార్టులోనే ఇదే పరిస్థితి వచ్చిందన్నారు. ముందుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిచినట్లు ప్రకటించి డిక్లరేషన్ ఇచ్చే సమయంలో అధికార పార్టీ నేతలు, ఎలెక్షన్ అథారిటీగా వ్యవహరించిన కమిషన ర్ చల్లా ఓబులేసు టీడీపీ అభ్యర్థులు గెలిపించడమే లక్ష్యంగా పనిచేశారన్నారు. జగనన్న కన్నా రెండింతల సంక్షేమ పథకాలు ఇస్తామంటే నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. 2029 ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.


