● ప్రారంభమైన బ్యాలెట్ పేపర్ల ముద్రణ ● జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు ● మొదటి విడతకు 13వ తేదీన నోటిఫికేషన్
మొదటి విడతలో ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయంటే.. ( ఓటర్ల వారీగా )
మండలం మొత్తం గ్రామ మొత్తం పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం
పంచాయతీలు వార్డులు ఓటర్లు
ఆదోని –1 20 200 20,265 20,251 03 40,519
ఆదోని – 2 19 202 25,121 25,248 14 50,383
హొళగుంద 17 174 22,059 22,059 16 44,134
కోసిగి 24 242 27,749 29,024 12 56,785
కౌతాళం 30 302 29,154 30,515 11 59,680
మంత్రాలయం 20 210 23,997 25,133 04 49,134
నందవరం 15 178 23,604 24,503 04 48,111
పెద్దకడుబూరు 20 206 22,881 23,425 02 46,308
ఎమ్మిగనూరు 17 202 29,660 29,834 05 59,499
కర్నూలు(అర్బన్): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యా యి. మూడు విడతలుగా ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు గతంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. మొదటి విడత ఎన్నికల నిర్వహణకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రక్రి య ప్రారంభమవుతున్న దృష్ట్యా, ముందుగానే మొ దటి విడత ఎన్నికలు జరగనున్న ఆదోని డివిజన్‌లో ని తొమ్మిది మండలాలకు జిల్లా పరిషత్‌లోని డీపీఆర్‌సీ భవనంలో భద్రపరిచిన ఎన్నికల సామగ్రిని ప్రత్యేక వాహనాల్లో తరలించారు. అలాగే ఈ ఎన్నికల నిర్వహణకు అవసరమైన(సర్పంచు/వార్డు స భ్యుల) బ్యాలెట్ పేపర్ల ముద్రణను కూడా మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రక్రియను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు జిల్లా పరిషత్ సీఈఓ ఆర్.సుధాకర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జీ.భాస్కర్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణకు స్టేజ్–1 ఆర్‌ఓలుగా 226 మంది, స్టేజ్–2 ఆర్‌ఓలుగా 582, స్టేజ్ –1 ఏఆర్‌ఓలు 226 మందిని నియమించారని డీపీఓ తెలిపారు.


