బొమ్మలసత్రం: నంద్యాల, గోస్పాడు మండలాలల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ కై వసం చేసుకోవటంతో నంద్యాల పట్టణంలో సంబరాలు మిన్నంటాయి. రెండు మండలాధ్యక్షుల పదవులతో పాటు రెండు జెడ్పీటీలను కై వసం చేసుకుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ధీటుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారు. ఫలితంగా టీడీపీకి చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా సగానికి పైగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచి సత్తాచాటారు. శనివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో శిల్పా నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిల, సీనియర్ నేత పీపీ నాగిరెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డిని భారీ గజమాలలతో సన్మానించారు.


