బనగానపల్లె రూరల్: జిల్లాలోనే నాపరాతి పరిశ్రమకు బనగానపల్లె మండల పలుకూరు గ్రామం ఎంతో ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఎంతో విలువైన నాపరాయి గనులు ఉన్నాయి. గ్రామంలోని శ్రీ రామేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 308 సర్వే నంబరులో నాలుగు ఎకరాల మాన్యం భూమి ఉంది. ఇందులో రూ. కోట్ల విలువు చేసే నాపరాయిని అధికార పార్టీ అండదండలతో మైనింగ్ మాఫియా దర్జాగా తరలించి సొమ్ము చేసుకుంటోంది. రెండేళ్లుగా ఈ దందా సాగుతున్న దేవదాయ, మైనింగ్, రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించు కోవడం లేదు. ఆలయ భూమిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆలయ అర్చకులు పలుమార్లు బనగానపల్లె మండల తహసీల్దార్, ఆర్టీఓ, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. అయితే ఫిర్యాదులు చేసిన రెండు మూడు రోజులు మాత్రం అక్రమ మైనింగ్‌ను తాత్కాలికంగా ఆపివేసి మళ్లీ యథేచ్ఛగా కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా, రాయల్టీ చెల్లించకుండా మైనింగ్ మాఫియా రూ. కోట్లు సంపాదిస్తున్నా అడిగేవారు లేరు. ఈ సర్వే నంబర్లో అక్రమ మైనింగ్ రోజురోజుకు విస్తరించింది. మరికొన్ని రోజులు ఇలానే కొనసాగితే శివాలయానికి ముప్పు ఉందని భక్తులు వాపోతున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు సంయుక్తంగా దాడులు చేసి అక్రమ మైనింగ్ పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆలయ విలు వైన భూమిని కాపాడాలని భక్తులు కోరుతున్నారు.
మాన్యం భూమిలో యథేచ్ఛగా
అక్రమ మైనింగ్
అధికారులకు ఫిర్యాదు చేసినా
చర్యలు శూన్యం
అధికార పార్టీ అండతో
రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా


