వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలు
కౌంటింగ్ కేంద్రంలో కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఓట్లను లెక్కిస్తున్న ఉద్యోగులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నందికొట్కూరులో విజయకేతనం ఎగురవేసింది. కొన్ని మున్సిపాలిటీల్లో మెజారిటీ వార్డు మెంబర్లను గెలుచుకుని సత్తా చాటింది. మరికొన్ని మున్సిపాలిటీల్లో గట్టి పోటీ ఇచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేసింది. 32 వార్డులున్న మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ 23 వార్డులు గెలుచుకోగా అధికార పార్టీ 9 వార్డులకే పరిమితమైంది. మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ ఫాతిమాబీ 2,634 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి సబేరున్నిసాపై ఘన విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ధారా సుధీర్.. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు విజయానికి కృషి చేశారు. బైరెడ్డి తనదైన శైలిలో పోలింగ్‌ను నడిపి నందికొట్కూరులో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేశారు. ఈ విజయంతో నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
కోట్ల సుజాతమ్మ
అలా బయటపడ్డారు!
డోన్ మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ గట్టిపోటీ ఇచ్చింది. ఇక్కడ టీడీపీ నుంచి మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన కోట్ల సుజాతమ్మ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఒక దశలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చైతన్య 500 ఓట్ల మెజార్టీ సాధించారు. ౖవైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం ఖాయమనుకున్న తరుణంలో టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ చివరి నిమిషంలో కేవలం 375 ఓట్ల స్వల్ప మెజర్టీతో నెగ్గారు. పోలింగ్ రోజు అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను బయటకు లాగి పచ్చ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడింది. ఏకపక్షంగా ఓట్లు వేసుకుంది. అయినా కోట్ల సుజాతమ్మ ఓటమి అంచుల దాకా వెళ్లి బయటపడటం చర్చనీయాంశమవుతోంది. మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా వైఎస్సార్‌సీపీ 15 వార్డుల్లో, సీపీఐ 2 వార్డుల్లో విజయం సాధించాయి. టీడీపీ 16 వార్డులు గెలుచుకోగా, జనసేన 2, ఇండిపెండెంట్ 1 వార్డులు గెలుచుకున్నాయి.
గూడూరులో హోరాహోరీ
కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీలో వైఎస్సార్‌సీపీ గట్టి పోటీ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి పద్మావతి విజయం అంచుల వరకు వచ్చారు. చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థి సునితా బాయి 1,463 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 23 వార్డులున్న మున్సిపాలిటీలో 11 టీడీపీ, 8 వైఎస్సార్‌సీపీ, జనసేన 1, బీజేపీ 1, 2 ఇండిపెండెంట్లు గెలిచారు.
ఆదోనిలో ఇండిపెండెంట్ విజయం
ఆదోని మున్సిపాలిటీలో విజయం వైఎస్సార్‌సీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య దోబూచులాడింది. జనసేనకు చెందిన స్వప్నకు టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. చివరకు ఆమె 2,062 ఓట్లతో చైర్‌పర్సన్ అభ్యర్థిగా విజయం సాధించారు. 52 వార్డులున్న మున్సిపాలిటీలో టీడీపీ 30 వార్డులు, వైఎస్సార్‌సీపీ 16 వార్డులు గెలుచుకున్నాయి. సీపీఐ 1, సీపీఎం 1, బీజేపీ 3, టీడీపీ రెబల్ అభ్యర్థి ఒక స్థానాన్ని గెలుచుకున్నారు.
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు కార్పొరేషన్‌తో పాటు 7 మున్సిపాలిటీలు, 2 నగర పంచాయతీలు ఉండగా ఇప్పటికే ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపాలిటీలను అధికారం అడ్డుపెట్టి టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఆత్మకూరు మున్సిపాలిటీలోని 4 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించగా.. 1 టీడీపీ, 1 వైఎస్సార్‌సీపీ, 1 సీపీఎం, 1 ఇండిపెండెంట్‌లు కై వసం చేసుకున్నారు.
కర్నూలులో పోలీస్ మార్కు విజయం, కౌంటింగ్‌లో మంత్రి హల్‌చల్
కర్నూలు మేయర్ స్థానాన్ని టీడీపీ కై వసం చేసుకుంది. మంత్రి టీజీ భరత్ పోలింగ్ నాడు అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టి ఎన్నికలను ఏకపక్షంగా మార్చుకుని రిగ్గింగ్, రీసైక్లింగ్‌కు పాల్పడ్డారు. మెజారిటీ వార్డుల్లో ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపారు. కొన్ని వార్డుల్లో అభ్యర్థులను పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. చీఫ్ ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల్లో ఉండకుండా అడ్డుకున్నారు. క్యూలైన్‌ల వద్దే డబ్బులు పంచారు. కొన్ని వార్డుల్లో బెదిరింపులకు పాల్పడ్డారు. అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో ఈ ఎన్నికల్లో పచ్చ పార్టీ గెలుపొందింది.
కౌంటింగ్‌లో మంత్రి హల్‌చల్
కౌంటింగ్ హాల్‌లో మంత్రి టీజీ భరత్ హల్‌చల్ సృష్టించారు. అక్కడే మకాం వేసి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. పలు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచినా అధికారం అడ్డుపెట్టి రీకౌంటింగ్ పేరుతో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించుకున్నారు. 52వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రణీత్ గెలవగా కోడుమూరు పచ్చ నేతతో పాటు మంత్రి రీకౌంటింగ్ కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రీకౌంటింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి రమేష్ గెలిచినట్లు డిక్లేర్ చేసుకున్నారు. అదే విధంగా 50వ వార్డులోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం సాధించగా రీకౌంటింగ్ పెట్టారు. మొత్తం 68 డివిజన్లలో ప్రధాన పార్టీలు టీడీపీ 52, వైఎస్సార్‌సీపీ 11, బీజేపీ 3, జనసేన 2 స్థానాల్లో గెలిచాయి. గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలు ఇవ్వలేదు.
నందికొట్కూరు మున్సిపాలిటీలో
వైఎస్సార్‌సీపీ ఘన విజయం
డోన్‌లో దోబూచులాడిన విజయం
చివరకు స్వల్ప ఆధిక్యంతో నెగ్గిన
కోట్ల సుజాతమ్మ
బేతంచెర్లలో వైఎస్సార్‌సీపీ ముందంజ
మెజార్టీ వార్డులు గెలుచుకున్న
వైఎస్సార్‌సీపీ
గూడూరు నగర పంచాయతీలో
హోరాహోరీ
ఆదోనిలోనూ గట్టి పోటీ ఇచ్చిన
వైఎస్సార్‌సీపీ
కర్నూలులో అధికార పార్టీ
రిగ్గింగ్ ఎఫెక్ట్‌తో
గెలుపు
డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల నగర పంచాయతీలో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి దూదేకుల దస్తగిరి ముందంజలో ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా, వైఎస్సార్‌సీపీ 18 వార్డులను గెలుచుకుంది. టీడీపీ 10 వార్డులకే పరిమితమైంది. అయితే ఇక్కడ 8 వార్డుల్లో రీకౌంటింగ్ నిర్వహించాలంటూ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీసులను అడ్డుపెట్టి హడావుడి చేశారు. అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఇక్కడ రీకౌంటింగ్ నిర్వహించారు. అయినా వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసిన వార్డు నెంబర్లు విజయం సాధించినట్లు రీకౌంటింగ్‌లోనూ తేటతెల్లమైంది. ఇదిలా ఉంటే అర్ధరాత్రి 12 గంటల సమయానికి వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి దస్తగిరి ఐదో రౌండ్ ముగిసే సరికి 1,553 ఓట్ల మెజారిటీలో ఉన్నారు.


