మండలాలకు చేరిన బ్యాలెట్‌ పేపర్లు | - | Sakshi
Sakshi News home page

మండలాలకు చేరిన బ్యాలెట్‌ పేపర్లు

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

కర్నూలు(అర్బన్‌): ఈ నెల 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్‌ పేపర్లను ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలకు పంపినట్లు స్థానిక సంస్థల ఎన్నికల అధికారి/ జెడ్పీ సీఈఓ ఆర్‌ సుధాకర్‌రెడ్డి తెలిపారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణలో జాప్యం జరగరాదనే ఉద్దేశంతో జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్‌ డా. ఏ సిరి ఆదేశాల మేరకు స్థానిక జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనంలో బ్యాలెట్‌ పేపర్లను ముద్రించడం జరిగిందన్నారు. ముద్రించిన బ్యాలెట్‌ పేపర్లను ఈ నెల 1వ తేదీ నుంచి ఆయా మండలాలకు పంపించడం ప్రారంభిచామని, ఈ ప్రక్రియ మంగళవారం ఉదయంతో పూర్తి అయ్యిందన్నారు.

● కర్నూలు జిల్లాలో మొత్తం 432 ఎంపీటీసీ స్థానాలకు గాను 74 స్థానాలు ఏకగ్రీవం కాగా, 358 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయన్నారు.

● నంద్యాల జిల్లాలో మొత్తం 377 ఎంపీటీసీ స్థానాలకు గాను 152 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 225 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు.

● బనగానపల్లె మండలంలోని క్రిష్ణగిరి ఎంపీటీసీ స్థానానికి దాఖలైన నామినేషన్లన్ని తిరస్కరణకు గురి కావడంతో అక్కడ ఎన్నిక నిలిచిపోయిందన్నారు.

● నంద్యాల జిల్లాలో 224 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నట్లు తెలిపారు.

● కర్నూలు జిల్లాలో 26 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు.

● నంద్యాల జిల్లాలో 28 జెడ్పీటీసీలకు గాను 8 స్థానాలు ఏకగ్రీవం కాగా, 20 స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement