డ్వామా విజిలెన్స్‌ ఆఫీసర్‌గా నాగశేషాచలరెడ్డి | - | Sakshi
Sakshi News home page

డ్వామా విజిలెన్స్‌ ఆఫీసర్‌గా నాగశేషాచలరెడ్డి

Nov 4 2026 1:38 AM | Updated on Nov 4 2026 1:38 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా నీటి యాజమాన్య సంస్థ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా గోరంట్ల నాగశేషాచలరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన పంచాయతీరాజ్‌లో డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ స్థాయి అధికారి. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో డీవీవోగా నియమిస్తూ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే జీవో 1079 జారీ చేశారు. డ్వామాలో డీవీవో పోస్టు జూన్‌ నుంచి ఖాళీగా ఉంది. పరిపాలన అధికారి నాగశివలీల పూర్తి అదనపు బాధ్యతలతో ఈ పోస్టులో కొనసాగుతున్నారు. నూతన డీవీవోగా నియమితులైన నాగశేషాచలరెడ్డి జిల్లాలోని వివిధ మండలాల్లో ఎంపీడీవోగా పని చేశారు.

5న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 5న పోలింగ్‌ జరుగుతున్న దృష్ట్యా ఆయా ప్రాంతాల్లోని దుకాణాలు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తున్నట్లు సంయుక్త కార్మిక కమిషనర్‌ సీహెచ్‌ ఆషారాణి తెలిపారు. ఈ మేరకు ఏపీ కార్మిక శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు జోన్‌ పరిధిలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు పరిధిలోని దుకాణాలు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఆమె తెలిపారు.

క్వింటా ఉల్లి రూ.4,359

● మొక్కజొన్నకు రికార్డు స్థాయిలో రూ.2,964 ధర

కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు ఉల్లి గడ్డల తాకిడి పెరిగింది. మార్కెట్‌కు 6,890 క్వింటాళ్లు(260 లాట్లు) విక్రయానికి వచ్చాయి. ఉల్లికి కనిష్ట ధర రూ.729, గరిష్ట ధర రూ.4,359 లభించగా.. సగటు ధర రూ.3,248 నమోదైంది. వేరుశనగ ధర కనిష్టంగా రూ.5,416, గరిష్టంగా రూ.9,269 లబించగా.. సగటు ధర రూ.7,109 పలికింది. ఈ సారి మొక్కజొన్న పంటకు గరిష్ట ధర రూ.2,964 లభించింది. ఈ సారి వర్షాభావం వల్ల మొక్కజొన్న పంట పూర్తిగా పాడైంది. దిగుబడులు లేవు. మార్కెట్‌కు 43 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. దిగుబడులు లేని నేపథ్యంలో రికార్డు స్థాయి ధర లభించడం గమనార్హం. మిర్చిలో రెడ్‌ రకానికి కనిష్ట ధర రూ.8,099, గరిష్ట ధర రూ.2,2002 లభించగా.. సగటు ధర రూ.20,299 ధర లభించింది. ఆదోనిలో పత్తి ధరలు తగ్గిపోతున్నాయి. కనిష్ట ధర రూ.7,080, గరిష్ట ధర రూ.9,411 లభించగా.. సగటు ధర రూ.9,039 నమోదైంది.

ఎన్నికల విధుల్లో

8,681 మంది ఉద్యోగులు

కర్నూలు(అర్బన్‌): ఈ నెల 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో వివిధ కేడర్లలో మొత్తం 8,681 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొంటున్నారు. జిల్లాలోని 26 మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1,432 పోలింగ్‌ కేంద్రాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో 1,575 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1,578 మంది ఏపీఓలు, 5,128 మంది ఓపీఓలు , రిజర్వులో 100 మంది విధులు నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తించిన 255 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో 300 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు.

ప్రతి 2 గంటలకోసారి పోలింగ్‌ శాతం

కర్నూలు(అర్బన్‌): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ప్రత్యేక యాప్‌లో ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్‌ శాతాన్ని నమోదు చేయాలని పీఆర్‌అండ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలోని ప్రిసైడింగ్‌ అధికారులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్న పోలింగ్‌కు సంబంధించిన ఓటింగ్‌ వివరాలను నమోదు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ్ద చూపాలన్నారు. ఇందుకు ప్రతి మండలంలో ఆరు నుంచి ఏడుగురు నిష్ణాతులైన డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ నుంచి పరిపాలనాధికారులు రాంగోపాల్‌, జితేంధ్ర, సరస్వతి, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement