ఆర్డీఓ దగ్గరకు వెళ్లండని చెప్పారు | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఓ దగ్గరకు వెళ్లండని చెప్పారు

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

ఆర్డీఓ దగ్గరకు వెళ్లండని చెప్పారు కారణం చెప్పకుండా పంపించారు

ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామం నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశాను. శనివారం నామినేషన్‌ పరిశీలనకు వెళ్లాను. మీ నామినేషన్‌లో తప్పులు ఉన్నాయి పత్తికొండ ఆర్డీఓ వద్దకు వెళ్లి పరిష్కరించుకోండి అని చెప్పారు. తప్పులు ఉన్నట్లు ఎలాంటి ఫారాలు ఇవ్వలేదు. ఆదివారం ఆర్డీఓ వద్దకు వెళ్తే ‘ఫారాలు లేవు. నేను ఎలా పరిష్కరించాలి’ అని చెప్పారు. –లక్ష్మి,పెద్దహోతూరు

నేను హత్తిబెళగల్‌ వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశాను. శనివారం నామినేషన్ల పరిశీలనకు వెళ్లాను. మధ్యాహ్నం 3 గంటలకు పరిశీలన పూర్తి చేసి..నీ నామినేషన్‌లో సంతకాలు లేవని ఆర్వో చెప్పారు. అప్పీళ్లు కోసం నామినేషన్‌లో తప్పులు ఉన్నాయని వెళ్లాలంటే ఫారం–5 ఇవ్వాలని కోరగా గంటన్నర తర్వాత ఇస్తామని చెప్పారు. 4.30 గంటలకు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్తే పోలీసు రాకుండా అడ్డుకున్నారు. –గుడపద్ప, హత్తిబెళగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement