నేడు డయల్‌ యువర్‌ సీఎండీ రద్దు | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ సీఎండీ రద్దు

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సీఎండీ, డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాలు రద్దు చేసినట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఈ కార్యక్రమాలను రద్దు చేసినట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నంతవరకు ఈ కార్యక్రమాలు జరగవని ఈ విషయాన్ని విద్యుత్‌ వినియోగదారులు గమనించాలని కోరారు.

వేరుశనగ గరిష్ట ధర రూ.8,060

ఎమ్మిగనూరుటౌన్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటా వేరుశనగ గరిష్టంగా రూ.8,060 ధర పలికింది. మార్కెట్‌కు 149 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. కనిష్ట ధర రూ.3,636లు, మధ్యస్థ ధర రూ.6,670ల ప్రకారం మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్‌ యార్డ్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు. అదేవిధంగా 432 క్వింటాళ్ల ఆముదాలు విక్రయానికి రావడంతో క్వింటా కనిష్ట ధర రూ.4,741లు, మధ్యస్థ ధర రూ.7,739లు క్వింటం గరిష్ట ధర రూ.8,007లకు వ్యాపారులు కొనుగోలు చేశారన్నారు.

మల్లన్నకు నృత్య నివేదన

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలయ నిత్యకళావేదికపై వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన నటరాజ నృత్య అకాడమీ వారు సంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. వినాయకకౌత్వం, శివాష్టకం, నమశ్శివాయతే తదితర గీతాలకు, అష్టకాలకు ప్రణవి, మేఘన, భవ్య, గాయత్రి తదితరులు నృత్యం ప్రదర్శించారు.

హత్యాయత్నం కేసులో

నిందితుల అరెస్ట్‌

వెల్దుర్తి: అల్లుగుండు వైఎస్సార్‌సీపీ నేత శ్రీరాంరెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 23న జరిగిన దాడి ఘటనలో అదే గ్రామానికి చెందిన 8 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆదివారం గ్రామ శివారులో ఉన్న నిందితులు దశరథుడు, బాల మద్దయ్య, నాగమద్దయ్య, పుట్లూరు మధు, బుగ్గ రమేశ్‌, బుగ్గ రామాంజనేయులును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ నరేశ్‌ తెలిపారు. నిందితులలో రాజేశ్వరి, సూరమ్మ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో ఆధిపత్యం కోసం దాడి జరిగినట్లు నిందితుల విచారణలో తేలిందన్నారు.

దేవరగట్టులో గాయపడిన యువకుడి మృతి

ఆలూరు రూరల్‌: దేవరగట్టు బన్ని కర్రల సమరంలో పాల్గొని గాయపడ్డ పరమేష్‌ (22) అనే యువకుడు ఆదివారం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. ఆలూరు మండలం ముద్దనగేరి గ్రామానికి చెందిన రంగమ్మ, మల్లికార్జునల కుమారుడు పరమేష్‌ బుధవారం హొళగుంద మండలం దేవరగట్టు బన్ని ఉత్సవానికి వెళ్లాడు. కర్రల సమరంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కర్నూలులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా కోలుకోలేక ఆదివారం మృతిచెందాడు.

బెల్లం ఊట ధ్వంసం

నందికొట్కూరు: పట్టణంలోని నీటిషికారిపేటలో ఆదివారం నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 90 లీటర్ల బెల్లం ఊటను ఎకై ్సజ్‌ శాఖ సీఐ రామాంజనేయులు నాయక్‌, ఎస్‌ఐ బాష్యం శ్రీనివాసులు, హరిత, పోలీసులు ధ్వంసం చేశారు. తయారు చేస్తున్న నాటు సారాయి స్థావరాలపై జిల్లా ఎకై ్సజ్‌ అధికారి ఆదేశాల మేరకు ఎకై ్సజ్‌ శాఖ పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టానికి వ్యతిరేకంగా నాటు సారా తయారు చేయడం నేరమన్నారు. అనంతరం అల్లూరు–మల్యాల క్రాస్‌ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ దాడుల్లో పకై ్సజ్‌ శాఖ పోలీసులు శేఖర్‌ నాయుడు, జనార్దన్‌, శివన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement