నేను మొలగవల్లి–2 ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. శనివారం చేపట్టిన పరిశీలనలో నేను దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో తప్పులు ఉన్నాయని పంపించారు. నేను నా భర్త ఎంపీడీఓ కార్యాలయం నుంచి వంద మీటర్ల దూరంలో ఉండాలని పోలీసులు సూచించారు. సాయంత్రం ఇస్తామన్న ఫారం–5, చెక్ లిస్టు కోసం వెళ్తే మా తో పాటు మరికొందరిని పోలీసులు ఆఫీసుకు వెళ్లకుండా తరమేశారు. – నరసమ్మ, మొలగవల్లి
నేను ఆలూరు ఎంపీటీసీ–3 అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. శనివారం మధ్యాహ్నం నా నామినేషన్ పరిశీలించారు. నామినేషన్ పత్రంలో తప్పులు ఉన్నాయని రేపు(ఆదివారం) ఉదయం చెక్‌లిస్టు, ఫారం–5 ఇస్తానని చెప్పారు. ఏ కారణంతో అప్లికేషన్ తిరస్కరిస్తున్నారో చెప్పలేదు. ఆదివారం సాయంత్రం ఆర్డీఓ కార్యాలయంలో ఆలూరు ఆర్వో ఆనంద్ రాజ్ కుమార్ వచ్చి శనివారం తేదీతో ఉన్న ఫారం–5 ఇచ్చారు. –వినోద్ కుమార్, ఆలూరు


